Israel King Solomon : 700ల పెళ్లిళ్లు చేసుకున్న రాజు..బీట్ చేయని భార్యల రికార్డ్

Israel King Solomon : 700ల పెళ్లిళ్లు చేసుకున్న రాజు..బీట్ చేయని భార్యల రికార్డ్

Israel King Solomon 700 Wives

Israel King Solomon 700 wives : రాజులు పోయారు రాజ్యాలు పోయాయి. కానీ రాజ్యాలను పాలించిన కొంతమంది రాజులు మాత్రం చరిత్రలో నిలిచిపోయారు. కొంతమంది రాజులు ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడి చరిత్రలో నిలిచిపోతే..మరికొతమంది రాజులు నియంతృత్వం..క్రూరత్వపు పాలతోను..ఇంకొంతమంది రాజులు కళలను పోషించినవారిగాను..ఇంకా కొంతమంది వారి విచిత్రమైన అలవాట్లతోను చరిత్రలో నిలిచిపోయాడు. కానీ ఇజ్రాయెల్ రాజు సులేమాన్ అభిరుచి మాత్రం భిన్నం..ఆయన ఆలోచనలు కూడా విభిన్నం అని చెప్పక తప్పదు.

1

 

ఎందుకంటే సులేమాన్ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందల పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఎన్ని వందలు అంటే ఏకంగా 700ల పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఎందుకంటే పలు కారణాలున్నాయి. ఆయనకు పెళ్లిళ్లు చేసుకోవటమంటే చాలా చాలా ఇష్టమట. అందుకే చెందిన సులేమాన్ అనే రాజు ఏకంగా 700 పెళ్లిళ్లు చేసుకున్నాడు..మరి ఆ పెళ్లిళ్లు కహానీ ఏంటో తెలుసుకోవాల్సిందే..

2

ఇజ్రాయెల్ రాజు సులేమాన్ తన జీవితకాలంలో మొత్తం 700 వివాహాలు చేసుకున్నాడు. అంతేకాదు అతనికి 700లమంది భార్యలతో పాటు మరో 300 మంది పరిచారకులు కూడా ఉన్నారు అని చరిత్ర చెబుతోంది. సులేమాన్ రాజుకు పెళ్లిళ్లు చేసుకోవడం అంటే చాలా ఇష్టమట.. అందుకనే పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ. అలా ఆ భార్యల సంఖ్యను 700లకు తీసుకెళ్లాడు.

6

అంతేకాదు.. మరో 300మంది అందమైన యువతుల్ని తనకు సపర్యలు చేయడానికి పెట్టుకున్నాడు. వీరంతా ఎల్లప్పుడూ సులేమాన్ సేవలో నిమగ్నమై ఉండేవారట. ఇలా పెళ్లి చేసుకున్నవారిలో విదేశీ యువరాణులు కూడా ఉన్నారు అంటే ఆయన ప్రత్యేకత ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సులేమాన్ పెళ్లి విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అప్పట్లోనే. ఆరోజుల్లో రాజులు బహుభార్యాత్వం కలిగినవారే..కొంతమంది 5 నుంచి 10 పెళ్లిళ్లు వరకు చేసుకున్నారు. భార్యలు కాకుండా ఇంకా పలు సంబంధాలు కూడా ఉండేవి. కానీ సులేమాన్ స్టైలే వేరు. నిత్య పెళ్లికొడుకే.

5

సులేమాన్ రాజు అన్ని పెళ్లిళ్లు చేసుకోవటానికి ఓ కారణం కూడా ఉందని చెబుతుంటారు. అదేమంటే..ఇజ్రాయోల్ కు అంతర్జాతీయపరంగా మంచి సంబంధాలు పెంచటానికేనంటారు. అంతర్జాతీయంగా సత్సంబంధాలను మెరుగుపరిచేందుకు సులేమాన్ అనేక మంది విదేశీ యువరాణులను వివాహం చేసుకున్నట్లు చెబుతారు. దీని కోసం సులేమాన్ ఫరాన్ కుమార్తెను కూడా వివాహం చేసుకున్నాడు.

3

సులేమాన్ రాజు తన పాలనలో పెళ్లిళ్లు చేసుకోవటమే కాదు..ప్రసిద్ధ జెరూసలేం ఆలయాన్ని, అనేక రాజభవనాలను, కోటలను కూడా నిర్మించి చరిత్రలో నిలిచిపోయాడు. అదే సమయంలో, అతను జెరూసలేం ఆలయాన్ని దేశంలోని మత జీవితానికి కేంద్రంగా మార్చాడు. అయితే ఇప్పటి వరకూ సులేమాన్ పెళ్లిళ్ల రికార్డ్ ను ఎవరూ బీట్ చేయలేదనే చెప్పాలి. 700లమంది భార్యలున్నా సులేమాన్ కు పిల్లల గురించి సమాచారం అందుబాటులో లేదు. సులేమాన్ పెళ్లిళ్ల ప్రస్తావన అనేక గ్రంథంలో ప్రస్తావించారు. ఇప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ రాజు యొక్క వివాహాల గురించి చర్చిస్తూనే ఉంటారు.