వింత ఆచారం : పెళ్లి కూతురిపై ఉమ్మివేయడం..అదే ఆశీర్వాదమట

  • Published By: nagamani ,Published On : October 31, 2020 / 03:02 PM IST
వింత ఆచారం :  పెళ్లి కూతురిపై ఉమ్మివేయడం..అదే ఆశీర్వాదమట

Kenya strange marriage : ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రజలవి ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు.ఆచారాలు..అలవాట్లు. వింత వింత ఆచారాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇటువంటివి కూడా ఉంటాయా? అనిపిస్తాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ఈ ఆచారాలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తాయి.


కొన్ని ఆచారాలు పెళ్లికూతురు పెళ్లికొడుకులను చీపురు కట్టమీద దాటిస్తారు.మరో ప్రాంతంలో శవంతో పెళ్లిచేసి ఆ చనిపోయిన వ్యక్తి తోడబుట్టిన సోదరులే ఆ వధువుకు భర్తగా వ్యవహరిస్తారు. ఇంకో ప్రాంతంలో వధూవరుడులతో వైన్ తాగిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే వింత వింత ఆచారాలు వింత వింతగా ఉంటాయి.


అటువంటి ఓ వింత ఆచారం గురించి తెలుసుకుందాం. ఆఫ్రియా దేశాల్లోని ఓ దేశం కెన్యా. బాగా వెనుకబడిన దేశం. కెన్యా ప్రజలు వారి సంప్రదాయాలను వదులుకోరు. అటువంటి సంప్రదాయం ఏమిటంటే పెళ్లి జరిగే సమయంలో పెళ్లి కూతురిపై ఉమ్మివేయడం కెన్యాలో ఒక ప్రత్యేక సంప్రదాయంగా ఈనాటికి కొనసాగుతోంది.


కెన్యాలోని మస్సాయ్ అనే తెగ వారి పెళ్లితంతు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. వధువు తండ్రి తన కుమార్తె తలమీద ఉమ్మివేస్తాడు. అలాగే ఆమె ఎదపై కూడా ఉమ్మి వేస్తాడు. ఇలా చేయడం వల్ల తన కూతురికి మంచి జరుగుతుందని వారు భావిస్తారు.


పెళ్లి కూతురిపై తండ్రి మొదటిసారిగా ఉమ్మివేసి ఆశీర్వదించాక..తరువాత ఉమ్మివేసే కార్యక్రమం కొనసాగుతుంటుంది. అంటే ఆ తరువాత ఆ పెళ్లికి వచ్చిన బంధువులు, అతిథులు అందరూ పెళ్లికూతురు తలపై ఉమ్మివేస్తూ ఆశీర్వదిస్తారు. ఆ తరువాత యథావిధిగా పెళ్లి తంతు ముగుస్తుంది.


పెళ్లి ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. అదొక ఒక అందమైన వేడుక. జీవితంలో చాలా కీలకమైన మలుపు వివాహం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లలో కొన్ని విచిత్రమైన పద్ధతులను పాటిస్తుంటారు.


కానీ ఏ పద్ధతిలో జరిగినా ఏ సంప్రదాయం ప్రకారం..నమ్మకాలతో జరిగినా వధూవరులిద్దరూ తమ జీవితాంతంకలిసి మెలిసి అన్యోన్యంగా ఉండాలనే అర్థం. కష్టంలోను సుఖంలోనూ నేనున్నాననే నమ్మకంతో వారి జీవితాలు ముడిపడి ఉండాలనేది వివాహ వ్యవస్థలో ఉన్న అంతరార్థం.