నవ్వు ఆగదు : ఫొటోకి ఫోజులిస్తూ నదిలో పడిపోయిన దంపతులు

10TV Telugu News

వెడ్డింగ్ ఫొటో షూట్ లో పాల్గొన్న ఓ జంట ఫొటోకి ఫోజులిస్తూ జారిపోయి నదిలో పడ్డారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వెడ్ ఫ్లానర్ వెడ్డింగ్ స్టూడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ దంపతులపై ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.
Also Read : వాహ్ : బ్యాలెట్ బాక్సులు మోసిన లేడీ కలెక్టర్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో…కేరళకు చెందిన తిజిన్,శిల్ప దంపతులు పంబా నది దగ్గర్లోని కాలువలో  ఫొటో షూట్ కోసం వెళ్లారు. ఓ చిన్న పడవలో దంపతులిద్దరూ ఓ అరిటాకు తమ తలపై పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తూ కూర్చొన్ని ఉన్నారు.ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ లోకాన్నే మర్చిపోయారు.ఇంతలో సడన్ గా బాలెన్స్ కోల్పోడంతో నీళ్లలో పడిపోయారు. దీంతో అక్కడున్నవాళ్లందరూ కొద్ది సేపు నవ్వు ఆపులోకపోయారు. దంపతులు కూడా కొద్ది సేపు నవ్వు ఆపులేకపోయారు. అయితే దంపతులకు ఓ తీపి గుర్తుగా ఉండేందుకు తామే ఇలా ఫ్లాన్ చేశామని వెడ్ ఫ్లానర్ వెడ్డింగ్ స్టూడియో తెలిపింది.

ఫొటో షూట్ సమయంలో సడన్ గా తమకు ఈ ఐడియా వచ్చిందని,ఆ దంపతులకు తెలియకుండా తామే ఇలా ఫ్లాన్ చేశామని స్టూడియో ఓనర్,చీఫ్ ఫొటోగ్రాఫర్ రాయ్ లారెన్స్ తెలిపారు.దంపతులు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేశారని తెలిపారు.ఫన్నీగా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ ఫ్లాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
Also Read : షెడ్యూల్ విడుదల : మే 6, 10, 14 తేదీల్లో స్థానిక ఎన్నికలు

10TV Telugu News