ఆమెకు హ్యాట్సాఫ్: కన్నీరు వస్తున్నా కర్తవ్య నిర్వహణ ఆపలేదు

ఆమె నిజమైన జర్నలిస్ట్. పని పట్ల ఆమెకున్న చిత్తశుద్దికి హ్యాట్సాఫ్ అంటూ రకరకాల కొటేషన్లతో సోషల్ మీడియాలో ఓ మహిళ ఫొటో వైరల్ గా మారింది. దాడులకు సైతం బెదరని ఆమె ఆత్మస్థైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

ఆమె నిజమైన జర్నలిస్ట్. పని పట్ల ఆమెకున్న చిత్తశుద్దికి హ్యాట్సాఫ్ అంటూ రకరకాల కొటేషన్లతో సోషల్ మీడియాలో ఓ మహిళ ఫొటో వైరల్ గా మారింది. దాడులకు సైతం బెదరని ఆమె ఆత్మస్థైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారు కదా మనదేశాన్ని ముందుకు నడిపించేందంటూ అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె పేరు షాజిలా అబ్దుల్ రెహమాన్. మళయాల కైరలీ టీవీలో కెమెరాపర్సన్ గా పనిచేస్తుంది. బుధవారం శబరిమళలో మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందూ సంఘూలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టాయి. రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఆందోళనలను కవర్ చేయడానికి షాజిలా వెళ్లారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు షాజియాతో పాటు మరికొందరు జర్నలిస్టులపై దాడి చేశారు.

షాజియా కెమెరాను ఆందోళనకారులు లాక్కున్నారు. అయితే వెంటనే ఆమె ఆందోళనకారుల నుంచి కెమెరాను లాక్కొని రిపోర్టింగ్ కొనసాగించింది. ఆందోళకారుల దాడిలో గాయపడినప్పటికీ వృత్తి పట్ల నిబద్ధతతో పంటికింద బాధను దిగిమింగి రిపోర్టింగ్ కొనసాగించిన ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై స్పందించిన షాజిలా మాత్రం వారు దాడి చేసినందుకు తాను బాధపడలేదని, దాని వల్ల మంచి విజువల్స్ మిస్సయ్యాను అంటూ చేసే పని పట్ల తన చిత్తశుద్ది చాటుకొంది.