సూపరో సూపర్ : ఆటోపైన మినీ గార్డెన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2019 / 10:38 AM IST
సూపరో సూపర్ : ఆటోపైన మినీ గార్డెన్

హీట్ ను బీట్ చేయడానికి ఓ ఆట్ డ్రైవర్ విన్నూత రీతిని ఎంచుకున్నాడు.అద్భుతమైన ఫ్లాన్ తో దేశాన్ని ఆశ్చర్యపర్చాడు.ఆటో పైనే ఓ మినీ గార్డెన్ ను ఏర్పాటుచేసిన అతడిని చూసి అందరూ వాట్ ఏ ఐడియా గురూ అంటూ తెగ పొగిడేస్తున్నారు.ఇలాంటి ఐడియా మాకు రాలేదేంటబ్బా అని కొందరు ఆటో డ్రైవర్లు ఫీల్ అవుతున్నారు.ఏసీలో ఉన్నఫీలింగ్ కల్గుతోందంటూ ఈ ఆటోలో ప్రయాణించిన పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అంతేకాకుండా కొంతమంది ప్రయాణికులు సర్వీస్ ఛార్జి కన్నా పది రూపాయలు ఎక్కువ ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు.

మండే ఎండాకాలంలో ఆటో ఎన్ని గంటలయినా నడిపేందుకు సిద్దమంటున్నాడు కోల్ కతాకు చెందిన బిజయ్ పాల్ అనే ఆటోడ్రైవర్.తన ఆటోపై బిజయ్ ఓ గార్డెన్ ను ఏర్పాటు చేశాడు.కేవలం ప్లెయిన్ గ్రాస్ మాత్రమే కాకుండా చిన్న చిన్న చెట్లు,పొదలు కూడా ఈ రూఫ్ టాప్ గార్డెన్ లో ఉన్నాయి.ఈ గార్డెన్ పట్ల బిజయ్ చాలా కేర్ తీసుకుంటాడు.తన సంపాదనలో అధికమొత్తం ఈ గార్డెన్ సంరక్షణ కోసం ఖర్చుపెడతాడు.ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆ చెట్టకు నీళ్లు పోస్తాడు.గ్రీన్ కలర్ లో ఉన్న ఈ ఆటోకి నెటిజన్లు గ్రీన్ ఆటోగా పేరు పెట్టారు.ఎల్ పీజీతో నడిచే ఈ గ్రీన్ ఆటో పూర్తి పర్యావరణ హితంగా ఉంది.అంతేకాకుండా పర్యావరణ ప్రేమికుడైన ఈ ఆటోడ్రైవర్ రూఫ్ టాప్ గార్డెన్ కింద బెంగాలీ భాషలో చెట్టను కాపాడుకుందాం…ప్రాణాలు రక్షించుకుదాం అని రాశాడు. ఈ ఆటో ఫొటోలు,వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.