సింహాల ఫైట్… సైలెంట్ గా తప్పించుకున్న బర్రె

  • Published By: venkaiahnaidu ,Published On : September 2, 2019 / 10:14 AM IST
సింహాల ఫైట్… సైలెంట్ గా తప్పించుకున్న బర్రె

సింహాల మధ్య జరిగిన ఫైట్ కారణంగా ఓ బర్రెకు పునర్జన్మ లభించింది. దక్షిణాఫ్రికాలోని క్రుగేర్ నేషనల్ పార్క్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర ఆకలితో ఉన్న సింహాలు ఓ బర్రెను ఈడ్చుకువచ్చి బంధించాయి. ఆ బర్రెను తినేందుకు ఐదు సింహాలు గుమిగూడాయి. ఇంతలోనే ఆ గుంపులోని రెండు సింహాల మధ్య ఫైట్ మొదలైంది.

ఆ ఫైట్ లో మిగతా సింహాలు కూడా పాల్గొన్న సమయంలో.. బర్రె అక్కడి నుంచి మెల్లగా తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత సింహాలు కూడా విచ్చలవిడిగా పరుగెత్తాయి. 30 సెకన్ల నిడివి ఉన్న దీనికి సంబంధించిన వీడియోను  ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

ఈ లయన్స్ ఒక పాఠం నేర్పుతాయి. వాటి దగ్గర తినడానికి ఆహారం ఉంది కానీ ఒకరితో ఒకరు పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆహారం దూరంగా వెళ్ళిపోయింది అంటూ ప్రవీణ్ కశ్వాన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.