Viral Video : తప్పు ఎవరిది.. ఈ రెండు కథల్లో మెయిన్ విలన్ ఎవరో.. మీరే చదవండి..

తప్పతాగి పడిపోయిన ఓ పెళ్లికొడుకు మరికొన్ని గంటల్లో తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో తప్ప తాగిన ఓ నూతన వధువు పోలీస్ స్టేషన్‌లో చిందులు తొక్కింది.

Viral Video :  తప్పు ఎవరిది.. ఈ రెండు కథల్లో మెయిన్ విలన్ ఎవరో.. మీరే చదవండి..

Liquor is the real villain

Liquor is the real villain : మద్యం మనిషికి జీవితాన్ని లేకుండా చేస్తుంది. ఎంతో అందంగా మలుచుకోవాల్సిన భవిష్యత్‌ను ఛిద్రం చేస్తుంది. బిహార్ లోని భగల్పూర్ లో తప్పతాగి పడిపోయిన ఓ పెళ్లికొడుకు (bridegroom) మరికొన్ని గంటల్లో తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో తప్ప తాగిన ఓ నూతన వధువు (newlywed bride) పోలీస్ స్టేషన్‌లో చిందులు తొక్కింది. ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఏనుగుల గుంపు హాయిగా ఎలా నిద్రపోతుందో చూశారా.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో

పెళ్లి పీటలపై తాళి కట్టించుకుందో లేదో ఫుల్‌గా మందు తాగిన ఓ నూతన వధువు పోలీస్ స్టేషన్ కి (police station) వచ్చింది. తాగిన మత్తులో సర్వం మర్చిపోయింది.  తన ప్రియుడితో రెండో పెళ్లి చేయమంటూ వీరంగం తొక్కింది. మహిళా పోలీసులు (women police) ఆమెకు ఎంత నచ్చచెప్పటానికి ప్రయత్నించినా మాట వినలేదు. చేతిలో ఫోన్.. పేపర్లు విసిరి కొట్టింది. ఆఖరికి పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. తల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లే తాగి ఇలా ప్రవర్తించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఈ ఘటనపై పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఆమెకు ఇష్టమైన పెళ్లి చేసి ఉంటే బాగుండేదని కొందరు. బలవంతంగా ఆమె పెళ్లి చేసి జీవితం నాశనం చేశారని కొందరు ట్వీట్ చేశారు.

ఇక ఈ ఘటనకు ముందు భగల్పూర్ (bhagalpur ) సుల్తాన్ గంజ్ విలేజ్‌లో (village) మద్యం తాగిన ఓ పెళ్లి కొడుకు మరికొన్ని గంటల్లో తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయి సోయలేకుండా పడిపోయాడు. లేచి చూసే సరికి ఇంకేముంది? ముహూర్తం దాటిపోయింది. అంతేనా? ఆడపెళ్లివారు గొడవకు దిగారు. పెళ్లికూతురు మందుకి బానిస అయినా అతను జీవితాంతం తనను ఎలా చూసుకుంటాడని ప్రశ్నించి ఈ పెళ్లికి ససేమిరా అంది. చేసేది లేక ఈ పెళ్లిని క్యాన్సిల్ చేశారు. ఇలా ఈ రెండు సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.