A man feeds water to a cobra : కోబ్రా దాహం తీర్చడానికి ప్రాణాలకు తెగించాడు..

ఎండాకాలంలో ఎండవేడిని మనుషులే కాదు మూగజీవాలు కూడా తట్టుకోలేవు. అడవుల్లో ఉండే క్రూర జంతువులు, విష సర్పాలు సైతం బయటకు వస్తుంటాయి. అలా ఎండను తట్టుకోలేక ఎటునుంచి వచ్చిందో ఏమో.. కోబ్రా ఒకటి జనావాసాల్లోకి వచ్చింది. దాహంతో అలమటిస్తూ కనిపించిన కోబ్రాని చూసి తన ప్రాణాలకు తెగించి ఓ వ్యక్తి దానికి నీరు అందించాడు. అతను చేసిన సాహసాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

A man feeds water to a cobra : కోబ్రా దాహం తీర్చడానికి ప్రాణాలకు తెగించాడు..

A man feeds water to a cobra

A man feeds water to a cobra : కోబ్రా (cobra).. ఎంతటి విష సర్పమో అందరికీ తెలుసు. అదను చూసి కాటు వేసిందో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అది ఎంతటి విష సర్పమైనా వాటికి ఆకలి, దాహం కామనే కదా. అయితే వాటిని పెంచేవాళ్లు వాటి అవసరాలు చూడగలరు. మామూలు వ్యక్తులు వాటిని చూస్తే ఆమడ దూరం పరుగులు పెడతారు. అలాంటిది ఒక వ్యక్తి దాహంతో అలమటిస్తున్న కోబ్రాకు మంచినీరు పట్టించి మానవత్వం (Humanity) చాటుకున్నాడు. ప్రాణాలకు తెగించి అతడు చేసిన సాహసాన్ని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. 52 సెకండ్లపాటు అతను కోబ్రాకు నీరు అందిస్తున్న వీడియో తన్సూ యెగెన్ (Tansu Yegen) అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ (viral) గా మారింది.

Ashwini Vaishnaw: హెలికాప్టర్ షాట్లతో అదరగొడుతున్న చిన్నారి.. మెచ్చుకున్న రైల్వే మంత్రి.. వైరల్ వీడియో

ఎండకాలంలో (summer) ఎండ వేడిని మనుష్యులే కాదు.. మూగజీవాలు సైతం తట్టుకోలేవు. ఇక విష సర్పాలు సైతం అడవుల నుంచి బయటకు వస్తుంటాయి. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో? ఓ కోబ్రా జనావాసాల్లోకి వచ్చేసింది. దాహానికి తాళలేకపోయింది. దాని పరిస్థితి చూసిన ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి అయినా నీరు అందించాలనుకున్నాడు. వెంటనే బకెట్ తో నీరు నింపి తాగించి దాని ప్రాణాలు కాపాడు. అతను బకెట్ లోకి నీరు నింపుతున్నంత సేపు పడగ విప్పి కూర్చున్న కోబ్రా అతను నీరు పట్టించగానే కాస్త ఉపశమనం పొందింది. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోని చూసి జంతు ప్రేమికులు (animal lovers) అందరూ అతని సాహసాన్ని, మానవత్వాన్ని మెచ్చుకుంటున్నారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రో డ్రైవర్ చేసిన పని వైరల్.. అనౌన్స్‌మెంట్‌కి బదులు!

పాములను నీటితో తడిపితే చర్మం ద్వారా అవి నీటిని పీల్చుకుంటాయట. అలా వాటికి హైడ్రేషన్ (hydration) అందుతుందట. విష సర్పాలు కాబట్టి మనం వాటి జోలికి వెళ్లడానికి భయపడతాం. ఇక ఎండాకాలంలో మూగజీవాలకు నీరు చాలా అవసరం. చాలామంది ఈ సీజన్ లో పక్షులకు నీరు అందించడం కోసం ఏర్పాట్లు చేస్తారు. ఇంట్లో పెంచుకునే పెట్స్ కి (Pets) కూడా విపరీతంగా దాహం వేస్తుంది. కాబట్టి వాటిని కూడా కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.