Viral Video: కోతికి మంచి నీరు తాగిపిస్తే..

Viral Video: కోతికి మంచి నీరు తాగిపిస్తే..

Viral Video

వేసవికాలం వచ్చింది.. ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండలు.. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.. ఇటువంటి పరిస్థితిలో మూగ జీవాలు కూడా కనీసం నీళ్లు లేక కొన్నిచోట్ల అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే దాహంతో ఉన్నఓ కోతికి టూరిస్టు దాహం తీర్చగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

ఓ విదేశీ టూరిస్టు.. త‌న వాట‌ర్ బాటిల్‌లోని నీటిని స్వయంగా కోతికి తాపంచగా.. ఇందుకు సంబంధించిన వీడియోని ఐఎఫ్‌ఎస్‌ ఆపీసర్‌ సుశాంత నందా ట్వీట్‌ చేశారు. టూరిస్ట్ కోతికి వాటర్‌ తాగిస్తుండగా మరో కోతి వచ్చి ఆ బాటిల్‌ను లాక్కోబోతుంది. బాటిల్‌ ఇవ్వకుండా ఆ కోతికి కూడా ఆ వ్యక్తి నిళ్లు తాగించాడు.

మరోవైపు తన దాహార్తిని తీర్చిన ఆ వ్యక్తి దగ్గరికి చేరి కోతి ఆప్యాయంగా కూర్చుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ జంతువుల పట్ల దయగా ఉండండి అంటూ సుశాంత నందా ట్వీట్‌కు ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. మానవత్వంతో ఆలోచించిన వ్యక్తిని అందరూ అభినందిస్తున్నారు.

అయితే ఈ విషయంలో విమర్శలు కూడా ఉన్నాయి. సహజంగా నివసించే జంతువులకు ఆహారం ఇవ్వకూడదని, అవి స్వయంగా జీవించాలి అని, నీటి గుంటలను సృష్టించడం వేసవిలో గుంటలను నీటితో నింపడం ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని అని, అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది అని అంటున్నారు.
మరికొందరు.. మంచినీటి సరస్సులు, నదులను కలుషితం చేస్తున్నారని, భవనాల నిర్మాణానికి సహజమైన తాగునీటి వనరులను ఆక్రమించడమే ఇందుకు కారణం అని, నీటి సంరక్షణ కోసం చెట్లను నాటాలని సూచిస్తున్నారు.