ఎంతవారలైనా.. : వైరల్‌గా మారిన వాల్ పోస్టర్‌ కిస్సింగ్

  • Published By: veegamteam ,Published On : February 14, 2020 / 05:35 AM IST
ఎంతవారలైనా.. : వైరల్‌గా మారిన వాల్ పోస్టర్‌ కిస్సింగ్

‘ముద్దు’ ప్రేమను తెలిపేది. అభిమానాన్ని వ్యక్తపరిచే సాధనం ముద్దు.  మనిషిని మనిషి ముద్దు పెట్టుకోవటం సర్వసాధారణం. కానీ ఓవ్యక్తి మాత్రం వాల్ పోస్టర్ ను ముద్దు పెట్టుకోవటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పోస్టర్ కిస్సింగ్ ఏంటో చూద్దాం..అర్థరాత్రి అంతా సద్దుమణిగింది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఓ వ్యక్తి ఆదారి వెంట వెళుతున్నాడు. చేతులు రెండు వెనుక పెట్టుకుని తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా అతనికి గోడమీద ఓ సినిమా వాల్ పోస్టర్ కనిపించింది. దాన్ని చూసుకుంటూ కొంచెం ముందుకెళ్లాడు. తరువాత వెనక్కి వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. నెమ్మదిగా వెళ్లి పోస్టర్ లో ఉన్న మూడు అమ్మాయిల మొఖాలను ముద్దు పెట్టేసుకున్నాడు.

అలా ముద్దు పెట్టుకున్న వ్యక్తి యువకుడు కాదు పెద్దవయస్సు ఉన్నవాడే. మూడు ముద్దులు పెట్టేసుకుని అంతే తాపీగా నడుచుకుంటూ పోయాడు. ఇది ఎక్కడ జరిగింది? ఆ ముద్దు పెట్టుకున్న వ్యక్తి ఎవరు అనేది అనవసరం. కానీ పోస్టర్ ను ఓ పెద్దాయన ముద్దు పెట్టుకోవటం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.