మరో డిఫరెంట్ : మైక్రోవేవ్ ఛాలెంజ్

  • Published By: madhu ,Published On : March 21, 2019 / 02:40 PM IST
మరో డిఫరెంట్ : మైక్రోవేవ్ ఛాలెంజ్

సోషల్ మీడియాలో మరో ఛాలెంజ్ దూసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలను వెర్రెత్తించిన కికీ ఛాలెంజ్ ఎవరూ మరిచిపోరు. తరువాత ఎన్నో ఛాలెంజ్‌లు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన కొత్త ఛాలెంజ్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ ఛాలెంజ్ పేరే ‘మైక్రోవేవ్’. ఈ చాలెంజ్‌లో పాల్గొన్న వారు వాటి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. 

మైక్రోవేవ్ ఓవెన్ గురించి తెలుసు కదా. అందులో ఫుడ్ వేడి చేస్తుంటారు. కేకులు..ఇలా ఇతరత్రా ఫుడ్ ఐటెమ్స్ చేస్తారు. అయితే అందులో ఫుడ్ పెట్టిన తరువాత అది తిరుగుతుంటుంటుంది. మైక్రోవేవ్ ఓవెన్‌లో ఎలాగైతే తిరుగుతుందో..అలా తిరగాలన్నమాట. ఏదైనా ఆహార పదార్థాలను తీసుకుని వాటితో రౌండ్‌గా తిరగాలి. ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ జత చేసి షేర్ చేయాలి. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ వైరల్‌గా మారిపోయింది.