మిరాకిల్ ఎస్కేప్..క్షణంలో తప్పిపోయిందిరా దేవుడా..!!

  • Published By: nagamani ,Published On : August 24, 2020 / 03:01 PM IST
మిరాకిల్ ఎస్కేప్..క్షణంలో తప్పిపోయిందిరా దేవుడా..!!

చావు కాస్తలో తప్పిపోయిందిరా దేవుడా..అనుకోవాలి ఈ ఘటనచూస్తే. భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయేమో అందుకనే చావు అంగుళం దూరం నుంచి దూసుకుపోయి బ్రతికి బైటపడ్డాడు అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే..చూసివారందరికీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మరి ఆ చావునుంచి తప్పించుకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గుండెలు హడలిపోతాయి..



కేరళలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్గా రూల్ ప్రకారం ఎడమ వైపు నుంచే చాలా తాపీగా వెళ్తున్నాడు. అప్పుడే వెనకనుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్ అతని పక్కనుంచి దూసుకుపోయింది. ఎంత ఫాస్టు గా అంటే కళ్లు మూసి తెరిచేలోగా ఆ వ్యాను కనిపించకుండా పోయింది. ఏజరిగిందో పాపం ఆ వ్యక్తికి కాసేపు ఏమీ అర్థంకాలేదు. కలా నిజమా అనుకున్నాడు. తరువాత గాబరాపడిపోయాడు. ఏం జరిగిందో అర్థం అయ్యేసరికి పాపం..వెనక్కి తిరిగి కాస్త దూరం పరిగెట్టి వెనక్కి తిరిగి చూసి ఓసి నీ బండబడా..కాస్తుంటే చచ్చేవోడినిగా..అంటూ దూసుకుపోయిన ఆ వ్యాన్ దిశగా చూస్తుండిపోయాడు భయం భయంగా..తరువాత కాస్త తేరుకుని మళ్లీ ఏదన్నా వాహనం గానీ వస్తుందేమో అన్నట్లుగా అటూ ఇటూ చూసుకున్నాడు..



కానీ పాపం నిజంగానే ఆ వ్యక్తికి భూమ్మీద నూకలుతినాలని రాసిపెట్టి ఉన్నట్టుంది..లేకపోతే ఏమయ్యేది..తలచుకోవటానికి గుండెలు బేజారవుతున్నాయి..యమా ఫాస్టుగా దూసుకుపోయిన ఆ వ్యాన్ కింద పడితే పరిస్థితి ఏంటో..థాంక్ గాడ్..తృటిలో తప్పించుకున్నాడు. కాగా..అక్కడే సిసికెమెరాలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్ట్ అయ్యాయి. పోలీసులు వెంటనే ఆ వ్యాన్ ను పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.