పిల్లను కాపాడినవారికి ఏనుగు ధన్యవాదాలు ఎలా చెప్పిందో చూడండీ 

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 09:07 AM IST
పిల్లను కాపాడినవారికి ఏనుగు ధన్యవాదాలు ఎలా చెప్పిందో చూడండీ 

ఏనుగులు గుంపులు గుంపులుగా..కుటుంబాలతో కలిసి మెలిసి ఉంటాయి. తమ కుటుంబానికి ఎంతో విలువనిస్తాయి. పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. వాటికి ఏ చిన్న ఆపద వచ్చినా మనుషుల్లాగే తల్లడిల్లిపోతాయి. పిల్లలు ప్రమాదవశాత్తు ఏదన్నా గుంటల్లో పడిపోతే రక్షించటానికి ఎంతగానో ప్రయత్నిస్తాయి. గుంపులో ఏ ఏనుగుకు ప్రమాదం వాటిల్లినా దాన్ని రక్షించేందుకు ఎన్నో యత్నాలు చేస్తాయి. గున్న ఏనుగుల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి.  తమ పిల్లలపై వాటికి ఉన్న మమకారం ఏ పాటిదో చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనంగా కనిపిస్తోంది. 

 ఓ అటవీ ప్రాంతంలో గుంపుతో కలిసి వెళ్తున్న ఓ గున్న ఏనుగు ప్రమాదవశాత్తు పెద్ద గోతిలో పడిపోయింది. ఆ గున్నను రక్షించేందుకు తోటి ఏనుగులు ఎంతో ప్రయత్నించాయి. చివరికి సాధ్యం కాలేదు. ఇది తెలిసిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రొక్లయినర్‌తో సహా అక్కడికి చేరుకున్నారు అధికారులు. వారిని చూడగానే ఏనుగులు..పక్కకు వెళ్లిపోయాయి. సిబ్బంది ఆ గోతిలోని మట్టిని పక్కకు తొలగిస్తూ..గున్న ఏనుగు బయటకు వచ్చేలా చేశారు.  ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ ఏనుగులు.. గున్న ఏనుగు బయటకు రాగానే గబగబా గున్న ఏనుగు దగ్గరక ఆదుర్దాగా వచ్చేశాయి.
అసలు విషయం ఇక్కడే జరిగింది. బైట పడిన ఆ గున్న తల్లి ఏనుగు అటవీ సిబ్బంది వైపు తిరిగి తొండం ఎత్తి కృత‌జ్ఞతలు తెలపింది. నా బిడ్డను కాపాడినందుకు ధన్యవాదాలు…అనే అర్థం వచ్చేలా  తొండాన్ని పైకి ..కిందకు ఊపింది.  వీడియోను ప్రవీణ్ కశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. మరి ఆ గజరాజు ధన్యవాదాల వీడియోపై మీరూ ఓ లక్కేయండి..

– – – –