ఈ టపాసులు తినేయొచ్చు..!: దీపావళి ట్రెండ్లీ కేక్స్

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 04:56 AM IST
ఈ టపాసులు తినేయొచ్చు..!: దీపావళి ట్రెండ్లీ కేక్స్

పండుగ ఏదైనా పిండి వంటలు అనేది సర్వ సాధారణం. ముఖ్యంగా దీపావళి పండుగ అంటే చక్కగా కొత్త బట్టలు కట్టుకుని దీపం పెట్టుకుని.. లక్ష్మీదేవికి పూజ చేసుకుని తరువాత ఓ స్వీటు నోట్లో వేసుకుని టపాసులు కాల్చుకోవటం మన సంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ అండ్ ట్రెడీషన్ ను ఎక్కువగా నడుస్తోంది.  పండుగ ఏదైనా దానికి తగ్గట్లుగా మార్కెట్ లో స్వీట్లతో పాటు కేకులు కూడా హల్ చల్ చేస్తున్నాయి. ఆయా పండుగలకు తగినట్లుగా కేకులను తయారు చేసి విక్రయిస్తూ..కష్టమర్లను ఆకట్టుకుంటున్నారు వ్యాపారస్తులు. 
ట్రెడిషన్ తో పాటు ట్రెండ్ ను కూడా వేళవించి..వెలుగు జిలుగుల దీపావళి పండుగకు వెరైటీ వెరైటీ కేకులు తయారు చేసి వెరైటీ కేకులను తయారు చేసి చక్కటి పేరు తెచ్చుకున్నారు మధ్య ప్రదేశ్ కు బబల్ పూర్ కు చెందిన శివంగి అనే మహిళ. 

అందని జీవితాల్లో సంతోషాలను..వెలుగులను నింపే పండగ దీపావళి పండుగకు  దేశమంతా ముస్తామైపోయింది. అమ్మ చేతి పిండివంటలతో కొత్తరకాల కేకులతో సందడి చేస్తున్నారు శివంగి. దీపావళి అంటే టపాసులు..బాంబులు..కాకపువ్వొత్తులు..మతాబులు. ట్రెండ్ ను ఫాలో అయ్యే శివంగి కూడా కేకుల తయారీలో కొత్తదనాన్ని రంగరించి కష్టమర్లను ఆకట్టుకుంటున్నారు. దీపావళికి స్పెషల్ గా టపాసుల రూపంలో కేక్ బాంబ్స్..కేక్ కాకరపువ్వొత్తులు. కేక్ మతాబులు..కేక్ తారాజువ్వలు తయారు చేస్తున్నారు శివంగి. 

అంతేకాదు మార్కెట్‌లో ఉండే అన్ని టపాసుల రూపంలోనూ ఈ కేక్స్ తయారు చేస్తున్నారు. రెండేళ్లుగా కేక్ బిజినెస్ చేస్తున్న శివంగి.. దీపావళి వేళ పిల్లల కోసం కేక్ బాంబ్స్ తయారు చేస్తు వినూత్నంగా కష్టమర్ల్ ప్రశంసలు పొందుతున్నారు. శివంగి చేసే కేకులకు మంచి డిమాండ్ కూడా ఉంది. బాణాసంచా రూపంలో కేకులను తయారు చేసేందుకు ఎంతో కష్టపడ్డారు శివంగి. 

కేకులు టపాసుల షేప్ లో చేయటమేకాకుండా..కేక్ టేస్ట్ ఏమాత్రం పోకుండా జాగ్రత్త పడ్డారు. 15 రోజుల ప్రయత్నం తర్వాత ఎట్టకేలకు రంగు రంగుల బాణాసంచా రూపంలో కేకులను తయారు చేశారు.  శివంగి తయారు చేసిన కేకులను చూసిన పిల్లలు కేరింతలు కొడుతున్నారు. పెద్దలు కూడా వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో శివంగి కేకుల బిజినెస్ మూడు కాకరపువ్వొత్తులు..ఆరు మతాబుల్లా వెలిగిపోతోంది. ప్రస్తుతం జబల్‌పూర్‌లోని బేకరీల్లో ఈ వెరైటీ కేక్ బాంబ్స్ సందడి చేస్తున్నాయి.