OMG : మహిళ చెవిలో పెరుగుతున్న పుట్టగొడుగుల కుప్పలు..!!

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 10:30 AM IST
OMG : మహిళ చెవిలో పెరుగుతున్న పుట్టగొడుగుల కుప్పలు..!!

పుట్టగొడుగుల పంట రైతులకు మంచి లాభాల్ని తెచ్చిపెడుతుంది. చిన్న చిన్న బుట్టల్లో..ఆఖరికి ప్లాస్టిక్ సీసాల్లో కూడా పుట్టగొడుగుల్ని పండిస్తుంటారు. కానీ మనం చెప్పుకునే ఘటన మాత్రం షాక్ అవ్వాల్సిన విషయమే. ఎందుకంటే ఓ మహిళ చెవిలో పుట్టగొడుగులు చక్కగా పంటలా పెరిగిపోయాయి. ఒకటి రెండూ కాదు ఏకంగా పదుల సంఖ్యలో మహిళ చెవిలో పుట్టగొడుగులు పెరగటం చూసి డాక్టర్లు నోరెళ్లబెట్టారు. మరి మహిళ చెవిలో పెరుగుతున్న పుట్టగొడుగుల పంటను..అదేనండీ పెరగిన వింతైన..విచిత్రమైన..ఘటన గురించి తెలుసుకుందాం. 

వియత్నాం యొక్క డీన్ బీన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ చెవిలో దురదగా ఉందని ENT స్పెషలిస్ట్ దగ్గరకెళ్లింది. చెవి ఇన్ఫెక్షన్ తో దురద వచ్చుంటుందని డాక్టర్లు అనుకన్నారు. దురద బాగా ఉందని..నొప్పిగా కూడా ఉంటోందని ఆమె చెప్పటంతో.. ఎండోస్కోపీ ద్వారా డాక్టర్లు ఆమె చెవిలోకి కెమెరాను పంపించారు. చెవిలోపల ఒకటీ రెండూ కాదు ఏకంగా పదుల సంఖ్యలో చిన్న చిన్న ఏవో ఉన్నట్లుగా గుర్తించారు. వాటిని పరీక్షించగా పుట్టగొడుగులు అని తెలిసింది. వాటిని చూసి డాక్టర్స్ షాక్ అయ్యారు. 

వెంటనే ఆపరేషన్ చేయాలని లేకుండా ప్రమాదం జగుతుందని చెప్పటంతో ఆమె అంగీకారంతో సర్జరీ చేసి వాటిని తొలగించారు. ఈ సర్జరీ చేసిన డాక్టర్లు మాట్లాడుతూ..ఇదో రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నారు. చెవుల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని సూచించారు. 

కాగా..ఆమె బీచ్ లో నీళ్లలో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చెవిలోకి నీరు వెళ్లటంతో నొప్పి వచ్చుంటుందని అనుకుంది. ఇదే విషయాన్ని డాక్టర్లతో చెప్పింది. చెవిలోకి చేరిన నీటితో పాటు పుట్టగొడుగులకు సంబంధించిన అవశేషం చెవిలోకి చేరి ఉంటుందనీ..దానికి చెవిలోపల వెచ్చని వాతావరణం తోడు కావడంతో చెవిలోనే మొలకలెత్తి ఉండవచ్చన్నారు. అలా అలా పెరిగి అవికాస్తా పదుల సంఖ్యలో పెరిగిపోయాయని తెలిపారు.