నేషనల్ డ్రెస్ : మోడీని పేల్చేస్తానన్న పాక్ సింగర్

  • Published By: venkaiahnaidu ,Published On : October 24, 2019 / 01:44 AM IST
నేషనల్ డ్రెస్ : మోడీని పేల్చేస్తానన్న పాక్ సింగర్

పాకిస్తాన్ పాప్ సింగర్ రబీ పిర్జాడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మోడీని పేల్చేస్తానంటూ ‘సూసైడ్ బాంబర్’ జాకెట్ వేసుకుని ట్విట్టర్లో ఫొటో షేర్ చేసింది. తాను కశ్మీరీ బిడ్డనని, మోడీని హిట్లర్ తో పోలుస్తూ ట్వీట్ చేసింది. ఆ ఫొటో వైరల్ గా మారింది.  లాహోర్ కు చెందిన ఈ సింగర్ ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి కశ్మీర్ పై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ భారత్ పై విషం కక్కుతున్న విషయం తెలిసిందే.

పాక్ సింగర్ రబీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీన్ని మెచ్చుకుంటూ కొందరు  పాకిస్థానీలు రీట్వీట్లు చేశారు. కొంతమంది పాక్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నావంటూ తిట్టిపోశారు. దీనిపై స్పందించిన భారతీయులు ఇది మీ నేషనల్ డ్రస్ కదా అంటూ చాలా మంది సెటైర్లు వేశారు. పాక్ డెవలప్ చేసిన ప్రత్యేకమైన డ్రస్ ని ప్రపంచమంతా చూస్తోందంటూ మరికొందరు ట్వీట్లు చేశారు.