వన్ నేషన్.. వ‌న్ కార్డ్‌ : అన్నీ ట్రాన్స్‌పోర్టుల‌కు ఒకే కార్డు

దేశవ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా ట్రాన్స్ పొర్టేషన్ ఉండాల్సిందే. క్షణాల్లో గమ్యాన్ని చేరుకోవాలంటే ట్రాన్స్ పొర్టేషన్ సౌకర్యం తప్పనిసరి.

  • Published By: sreehari ,Published On : March 4, 2019 / 02:07 PM IST
వన్ నేషన్.. వ‌న్ కార్డ్‌ : అన్నీ ట్రాన్స్‌పోర్టుల‌కు  ఒకే కార్డు

దేశవ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా ట్రాన్స్ పొర్టేషన్ ఉండాల్సిందే. క్షణాల్లో గమ్యాన్ని చేరుకోవాలంటే ట్రాన్స్ పొర్టేషన్ సౌకర్యం తప్పనిసరి.

దేశవ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా ట్రాన్స్ పొర్టేషన్ ఉండాల్సిందే. క్షణాల్లో గమ్యాన్ని చేరుకోవాలంటే ట్రాన్స్ పొర్టేషన్ సౌకర్యం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లాలంటే అందరూ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ పై ఆధారపడుతుంటారు. అయితే ప్రయాణ సమయాల్లో ప్రతిచోట పేమెంట్ మోడ్ భిన్నంగా ఉంటుంది. దీంతో ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు పడుతుంటారు ట్రావెలర్స్. ఇకపై ట్రావెల్ చేసేందుకు ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా త్వరలో అన్నీ ట్రాన్స్ పోర్టులకు ఒకే కార్డు రానుంది. ప్రస్తుతం మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసుల్లో స్మార్ట్ కార్డు విధానం నడుస్తోంది.
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు

ఇదే తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ కార్డు అనే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు అహ్మదాబాద్ వేదికగా నిలువనుంది. వన్ నేషన్ వన్ కార్డు విధానంతో అన్నీ పబ్లిక్ ట్రాన్స్ పోర్టులకు ఒకే కార్డుతో సులభంగా ప్రయాణించవచ్చు. ఈ విధానంతో దేశ ప్రజలకు ట్రావెల్ పరంగా భారీ ప్రయోజనాలు కలుగనున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లలో ఈ స్మార్ట్ కార్డులను స్వైప్ చేస్తే చాలు.. మీరు వెళ్లాల్సిన గమ్యానికి ట్రావెల్ చేయొచ్చు. 

ప్రయాణికులు చేయాల్సిందిల్లా.. స్మార్ట్ ట్రావెల్ కార్డులను వినియోగించేందుకు టికెట్ కౌంటర్ల దగ్గర పీఓఎస్ మిషన్లలో స్వైప్ చేయడమే. అంతే.. మీరు వెంటనే ట్రావెల్ టికెట్ పొందొచ్చు. మెట్రో రైలు స్మార్ట్ కార్డుతో నేరుగా ఎలా అయితే ట్రైన్ టికెట్ కొంటున్నారో అలానే ఈ కార్డుతో కూడా ఈజీగా టికెట్ పొందొచ్చు. ఇప్పటికే ఢిల్లీ మెట్రో ఈ కార్డు విధానంపై టెస్ట్ రన్ ప్రారంభించింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ కౌంటర్స్ (AFCs)ను ఏర్పాటు చేశారు.
Also Read : డేటా లీక్ చేయటానికి సిగ్గుండాలి, ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పని 

ఈ కౌంటర్లు ప్రయాణికుల ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలను రీడ్ చేస్తాయి. ఇప్పటివరకూ ఎఎఫ్సీ కౌంటర్లను కొన్ని మెట్రో స్టేషన్లకే పరిమితం చేశారు. ట్రయల్ రన్ ముగిశాక AFC కౌంటర్లను అన్నీ మెట్రో స్టేషన్లలో అమర్చనున్నారు. విదేశాల్లో డిజైన్ చేయిస్తే.. భారీ స్థాయిలో ఖర్చు అవుతుందని, అందుకే ఎఎఫ్సీ కౌంటర్ల డిజైన్ స్వదేశంలో రూపొందించేలా తీసుకొస్తే మెట్రో రైలు నెట్ వర్క్ మొత్తానికి అయ్యే భారీగా ఖర్చును తగ్గించు కోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. 
Also Read : హైదరాబాద్ లో కాంబ్లె ముఠా : పురుషుల మెడలో గొలుసులే టార్గెట్