Paan Burger : ‘పాన్ బర్గర్ అంట’.. కొత్త కాంబినేషన్ చూసి మండిపడుతున్న ఫుడ్ లవర్స్

చాక్లెట్ బిర్యానీ, మేగీ పానీ పూరీ.. ఇప్పుడు 'పాన్ బర్గర్'.. పేర్లు వింటేనే హడలెత్తిస్తున్న ఈ కొత్త కాంబినేషన్లు సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ పాన్ బర్గర్ ఎలా తయారో చేస్తారంటే?

Paan Burger : ‘పాన్ బర్గర్ అంట’.. కొత్త కాంబినేషన్ చూసి మండిపడుతున్న ఫుడ్ లవర్స్

Paan Burger

Paan Burger : పాన్ బర్గర్.. పేరు వినగానే ఇదేం కాంబో? అని హడలిపోతున్నారా.. విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామనైపోయింది కదా.. మరి ఈ కాంబో ఏంటో చూద్దాం.

Vicky kaushal : ఈ హీరో పిజ్జాలు, బర్గర్లు తింటే బరువు తగ్గుతాడంట.. అమితాబ్ తో సహా అంతా ఆశ్చర్యపోతున్నారు..

పాన్ ప్రియులు చాలామంది ఉంటారు. ఇక బర్గర్ అంటే పడి చచ్చిపోయే వారు ఉన్నారు. కానీ ఈ రెండు కలిపి తినడమంటేనే కాస్త మింగుడు పడట్లేదు. ఎవరైనా కొత్త రకం రుచులు టేస్ట్ చేయాలని అనుకున్నా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న కొన్ని కాంబోలు భయపెడుతున్నాయి.  ‘మేరా అప్నా పంజాబ్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో  “బర్గర్ పాన్ (ఘనీ పాన్ షాప్)”  అనే శీర్షికతో దానిని ఎలా తయారు చేస్తారో వీడియో పోస్ట్ చేశారు.

 

ఓ వ్యక్తి పాన్ బర్గర్ పాన్ తయారు చేస్తున్నట్లు వీడియో మొదలయ్యింది. ముందుగా బన్ను దానిపై తమలపాకు ఉంచాడు. తమలపాకు మీద డ్రై ఫ్రూట్స్, బాదం, సోంపు, చాక్లెట్లు ఇంకా కొన్ని స్వీట్ ఐటమ్స్ వేశాడు. మయోనైస్‌కు బదులు క్రీమ్ కూడా చల్లాడు. చివర్లో పైన బన్నును చేర్చాడు. అంతే పాన్ బర్గర్ రెడీ. ఇక దీని తింటే ఎలా ఉంటుంది అనేది తిన్నవారు చెప్పాలి. అయితే చూసిన వారు మాత్రం చికాకు పడుతున్నారు.

Burger order : ఈ బుడ్డోడు మాములోడు కాదు.. ఏకంగా 31 చీజ్‌బర్గర్లు ఆర్డర్ చేసి.. చివరకు..

‘చూడటానికి చాలా అసహ్యంగా ఉందని కొందరు.. ఇలాంటివి తయారు చేయడం ఆపండి’.. అని మరికొందరు అభిప్రాయపడ్డారు. అసలు వాటికి ఎసరు వచ్చేలా ఉంది ఈ కాంబోల వ్యాపారం. ఈ కాంబోలు చూస్తే నిజంగా పాన్, బర్గర్ ఇష్టపడేవారు రోత పుట్టేలా ఉందని వాపోతున్నారు.