Pet Dog: కుక్కతో ఇలాంటి పనులు కూడా చేయించొచ్చా.. ట్రైనింగ్ మామూలుగా లేదుగా!

ప్రతి పనిని కుక్కలకు నేర్పించొచ్చు. అలాగే కొద్ది రోజుల క్రితం ఓ గర్ల్ యోగా చేస్తుండగా ఆమెను అనుకరించింది కుక్క కూడా. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో బోలెడు లైకులు కొట్టేసింది. ఈ వైరల్ వీడియోలో మరో సారి హ్యుమన్ - డాగ్ రిలేషన్

Pet Dog: కుక్కతో ఇలాంటి పనులు కూడా చేయించొచ్చా.. ట్రైనింగ్ మామూలుగా లేదుగా!

Pet Dog

Pet Dog: ప్రతి పనిని కుక్కలకు నేర్పించొచ్చు. కొద్ది రోజుల క్రితం ఓ గర్ల్ యోగా చేస్తుండగా పెంపుడు కుక్క ఆమెను అనుకరిస్తూ అలానే చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో బోలెడు లైకులు కొట్టేసింది. ఇలాంటి వైరల్ వీడియోలో మరో సారి హ్యుమన్ – డాగ్ రిలేషన్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తన యజమాని చేస్తున్నంత సేపు లాండ్రీలో సమానంగా పనిచేసింది. కాదు కాదు.. ఆమెలాగే చేసింది.

మామూలుగా పనిచేసుకుంటుంటే కుక్కలు హెల్ప్ చేస్తాయని తెలుసు కానీ, ప్రతి పని చేసేసి.. లాండ్రీ పని తర్వాత బట్టలు కూడా ఆరబెట్టింది. ‘మేమిద్దరం కలిసి ఇవాళ ఉదయం లాండ్రీ పని చేశాం. నా ఫ్రెండ్ తో కలిసి పనిచేయడం చాలా అమేజింగ్ గా అనిపించింది’ అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు ఆమె. ఈ వీడియోకు 52వేల లైకులతో పాటు 3వేల 300కామెంట్లు కూడా వచ్చేశాయి.

View this post on Instagram

A post shared by Mary & Secret (@my_aussie_gal)