ఇదీ నిజం : ఏడాది క్రితం వార్త ఇప్పుడు వైరల్

  • Published By: venkaiahnaidu ,Published On : April 25, 2019 / 07:01 AM IST
ఇదీ నిజం : ఏడాది క్రితం వార్త ఇప్పుడు వైరల్

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్షోగ్రతలతో జనాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. రోడ్లపై బైక్ లపై వెళ్లే వాళ్లకు ఎండ నుంచి ఉపశమనం కోసం అంటూ రాజస్థాన్ రాష్ట్రం వినూత్నంగా ఆలోచించింది. మండే ఎండలో బైకులు, నడుచుకుంటూ వెళ్లే వాళ్లపై నీళ్లు చల్లుతున్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమే కానీ.. ఇప్పటిది కాదు. 2018 సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా వందల సంఖ్యలో దేశవ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎండవేడికి వాహనాలపై ప్రయాణిస్తూనే, రోడ్లపై నడుచుకుంటూ వెళ్తూనే పలువురు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో పలు చోట్ల స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి చాలా చోట్ల నీటి క్యాన్ లను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఎండలో రోడ్లపై  బైక్ మీద వెళుతున్న వారిపై, నడుచుకుంటూ వెళ్తున్న వారిపై నీళ్లను చల్లడం ప్రారంభించారు. వాహనాదారులు బైక్ లు ఆపి మరి కాసేపు తమపై నీళ్లు చల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు రాజస్థాన్ లో ఇలా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో లేటెస్ట్ గా తిరగటం ప్రారంభించాయి. అసలే ఎండాకాలం.. మండే ఎండలు ఉండటంతో.. ఇది నిజమే అనుకుంటున్నారు.

వాస్తవానికి ఈ వీడియో 2018 సంవత్సరానికి సంబంధించినవి.