వైరల్ వీడియో : నాగిని డ్యాన్స్ తో రెచ్చిపోయిన టీచర్లు

  • Published By: veegamteam ,Published On : November 29, 2019 / 09:09 AM IST
వైరల్ వీడియో : నాగిని డ్యాన్స్ తో రెచ్చిపోయిన టీచర్లు

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు నాగిని డ్యాన్స్ లతో రెచ్చిపోయారు. టీచర్లనే విచక్షణ మరిచిపోయారు. డాన్స్ లతో ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించారు. రాజస్తాన్‌లోని జాలోరీ జిల్లాలో టీచర్  చేసిన నిర్వాకం ఆమెను ఉద్యోగానికి ఎసరు పెట్టింది. టీచర్స్ ట్రైనింగ్‌ కోసం అధికారులు బుధవారం (నవంబర్ 27) ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొంచె ఖాళీ టైమ్ దొరికింది. దీంతో టీచర్లు వర్క్ వదిలేసి రెచ్చిపోయారు.  

గిని డ్యాన్స్‌ చేస్తూ ఊగిపోయారు. ఓ మహిళా టీచర్‌కు తోడు ఓ​ ఉపాధ్యాయుడు సైతం నాగిని నృత్యం చేస్తూ.. తెగ ఎంజయ్‌ చేశారు. పక్కనున్న తోటి ఉద్యోగులంతా చప్పట్లతో వారి డ్యాన్స్‌ను ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నాగిని నృత్యం చేసిన ఇద్దరిని ఉద్యోగంలో నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు ఝలక్ ఇచ్చారు.  మరో ఇద్దరు టీచర్లకు కూడా షోకాజు నోటీసులు జారీచేశారు.