మీకు మీరే సాటి : పాల్ చేష్ట‌లు – వ‌ర్మ సెటైర్లు

10TV Telugu News

తన విచిత్రమైన చేష్టలతో.. విచిత్రమైన హావభావాలు వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై రాంగోపాల్‌ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాశాంతి తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేఏ పాల్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Read Also : నన్ను కొట్టడానికి 100మంది వచ్చి.. చప్పట్లు కొట్టి వెళ్లారు

ఈ వీడియోలో పాల్ కారు ముందు సీటులో కూర్చొని బాక్సింగ్ చేస్తున్నట్లు విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉన్నారు. ఈ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వర్మ.. ‘ప్రపంచ దిగ్గజ బాక్సర్‌.. మరో దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ను మట్టికరిపించిన ఈవాండర్‌ హోలీఫీల్డ్‌కు కేఏ పాలే బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చాడని ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా’  అని క్యాప్షన్‌ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. పాల్ చేష్టలు చూస్తే నవ్వు వస్తుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

×