దుమ్ములేపుతున్నారుగా: టిక్ టాక్‌లో డూప్ సెలబ్రిటీలు

దుమ్ములేపుతున్నారుగా: టిక్ టాక్‌లో డూప్ సెలబ్రిటీలు

వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం టిక్ టాక్ లో వైరల్ గా మారిన వీడియోలు, ఫన్నీ వీడియోలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. దీంతో ఏ మాత్రం పోలికలు ఉన్నా వాళ్ల అభిమాన తారలను అనుకరిస్తూ వీడియోలు చేసేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దగ్గర్నుంచి మధుబాల, శ్రీదేవీ, విరాట్ కోహ్లీల వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. 

శ్రీదేవీలా హొయలు ఒలుకుతూ చాల్‌బాజ్, హిమ్మత్ వాలా సినిమా సీన్లతో రాఖీ అనే మహిళ చేసిన వీడియోలు శ్రీదేవీని గుర్తు చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ లాంటి వారు మరొకరు ఉండరనుకోవడానికి లేదు. ఇదిగో నజీమ్ ఖాన్ ఎంట్రీ అంటూ చేసిన వీడియో 28లక్షల మంది ఫాలోవర్లను దక్కించుకునేలా చేసింది. 

 

అక్కడితో అయిపోలేదు. బాలీవుడ్ అరుదైన కళ్లతో కరిష్మా కపూర్ మెస్మరైజ్ చూపులతో చేసిన వీడియో కూడా అదే స్థాయిలో పాపులర్ అయింది. వీడియోలో పాటలతో పాటు డైలాగ్ లు చెబుతున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇక కత్రినా కైఫ్ ను పోలి ఉన్న అలీనా రాయ్ గురించి చెప్పనక్కర్లేదు. అచ్చుగుద్దినట్లు ప్రింట్ దిగిపోయింది. మీరూ ఈ వీడియోలపై ఓ లుక్కేయండి.