సూపర్ క్యాట్: బుడ్డోడిని కాపాడింది.. వైరల్

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 05:45 AM IST
సూపర్ క్యాట్: బుడ్డోడిని కాపాడింది.. వైరల్

సాధారణంగా చాలా మంది జంతు ప్రేమికులు కుక్కపిల్లలను ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే కుక్క విశ్వాసానికి మారుపేరు అని పెంచుకునేవారు కొంతమంది… క్యూట్ గా ఉంటాయని పెంచుకునేవారు కొంతమంది. కానీ పిల్లులను ఎక్కువగా ఇష్టపడరు. చాలా మందికి పిల్లులంటే అస్సలు నచ్చదు. దాన్ని ఓ అపశకునంగా భావిస్తారు. కానీ ఈ వార్త చదివితే పిల్లులని కూడా పెంచుకోవాలనే కోరిక పుడుతోంది. మరి అదేంటో చూద్దామా.

ఓ ఇంట్లో చిన్నపిల్లాడిని వదిలేసి ఎవరిపనుల్లో వారున్నారు. ఆ పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ  మెట్లవైపుకు వెళ్లాడు. అక్కడే ఉన్న పిల్లి ఆ బుడ్డోడిని  చూసి.. పరిగెత్తుకెళ్లి పిల్లోడిని మెట్లవైపుకు వెళ్లకుండా అడ్డుకుంది. పిల్లోడిని పెద్ద ప్రమాదం నుంచి రక్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిల్లే కనుక లేకుంటే ఎంత ప్రమాదం జరిగుండేదో మీరే ఆలోచించండి. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ పిల్లులను అసహ్యించుకునే వారికి ఈ వీడియో చూపించండంటూ కమెంట్ చేశాడు.