TamilNadu: నిరూపించడానికే.. రూ.10కాయిన్లతో రూ.6లక్షల కారు కొనుగోలు చేసిన వ్యక్తి

తమిళనాడుకు చెందిన వ్యక్తి కార్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో ఫ్యామస్ అయిపోయాడు. అదెలా అంటే రూ.10కాయిన్లను చెల్లించి రూ.6లక్షల కార్ సొంతం చేసుకున్నాడు. నెల రోజులుగా కాయిన్లు పోగు చేసి కార్ డీలర్‌షిప్ దగ్గరకు వెళ్లగానే అంతా ఆశ్చర్యంతో షాక్ అయ్యారు.

TamilNadu: నిరూపించడానికే.. రూ.10కాయిన్లతో రూ.6లక్షల కారు కొనుగోలు చేసిన వ్యక్తి

Tamil Nadu

TamilNadu: తమిళనాడుకు చెందిన వ్యక్తి కార్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో ఫ్యామస్ అయిపోయాడు. అదెలా అంటే రూ.10కాయిన్లను చెల్లించి రూ.6లక్షల కార్ సొంతం చేసుకున్నాడు. నెల రోజులుగా కాయిన్లు పోగు చేసి కార్ డీలర్‌షిప్ దగ్గరకు వెళ్లగానే అంతా ఆశ్చర్యంతో షాక్ అయ్యారు. ఆరూర్ కు చెందిన వెట్రివెల్ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు.

“మా తల్లి ఓ షాపును నిర్వహిస్తున్నారు. అక్కడకు వచ్చిన రూ.10కాయిన్లను చెల్లవంటూ అవి తీసుకోవడానికి వచ్చిన వాళ్లంతా నిరాకరించేవారు. బ్యాంకుల్లోనూ చాలా మంది అధికారులు వాటి వాడకాన్ని తగ్గించేశారు. బ్యాంకుల్లో ఆ కాయిన్లు కౌంట్ చేయడానికి మెషిన్లు లేవని బుకాయించేవారు” అని వెట్రివేల్ చెప్పారు.

అంతేకాకుండా తమ ఏరియాల్లోని పిల్లలు రూ.10కాయిన్లతో ఆడుకోవడం మొదలుపెట్టారని, ఇవి చెల్లుబాటు అవుతాయని తెలియడానికే వాటితో కారు కొనుగోలు చేశానని అంటున్నాడు.

Read Also: ఐకానిక్ సెలబ్రేషన్స్‌లో కొత్త కాయిన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

“ఆర్బీఐ ఈ కాయిన్లు చెల్లవని చెప్పనంత వరకూ.. బ్యాంకులు వాటిని తిరస్కరించడానికి వీల్లేదు. దాని గురించి కంప్లైంట్ చేసినా తగు యాక్షన్ తీసుకోలేదు” అని వివరించాడు.

కార్ డీలర్‌షిప్ ఈ విషయం చెప్పగానే ఆ ట్రాన్సాక్షన్ కు ఒప్పేసుకున్నారు. అప్పుడే సంచులతో రూ.10కాయిన్లను తీసుకొచ్చాడు. కొత్త కారు తాళాలు అందుకున్న సంతోషంలో తానుంటే కార్ డీలర్ కాయిన్లు లెక్కపెట్టుకునే పనిలో ఉన్నారు.