Tenant Interview : ఆ సిటీలో అద్దెకి ఇల్లు దొరకడం కంటే .. గూగుల్ లో జాబ్ కొట్టడం ఈజీ

2022లో డామన్ భడోరియా సీటెల్ (Ripu Daman Bhadoria) నుంచి బెంగళూరికి మకాం మార్చాలి అనుకున్నాడు. అందులో భాగంగా అద్దె ఇంటికోసం తెగ వెతికాడు. పోస్ట్ కోవిడ్ తర్వాత అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగిన కారణంగా ఇల్లు దొరకడం.................

Tenant Interview :  ఇల్లు మారడం అంటే ప్రతి ఒక్కరికీ పెద్ద సమస్య. ఇంట్లో అందరికీ సౌకర్యవంతంగా ఉండే ప్రాంతంలో వెతికి వెతికి మరీ ఇల్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకోసం అద్దె ఇళ్ల (Tenant) వేట కొనసాగుతుంది. ఇల్లు దొరకగానే సరిపోయిందా? అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంట్లో వస్తువుల్ని అక్కడికి తరలించడానికి ప్యాక్ చేసుకోవడం.. తిరిగి వాటిని సర్దుకోవడం వరకూ చాలా సమయం పడుతుంది. అయితే ఇటీవల కాలంలో అద్దె ఇల్లు కావాలంటే మరో పెద్ద పరీక్ష ఎదురవుతోంది. బెంగళూరు (Bangalore) లాంటి సిటీల్లో అద్దె ఇల్లు కావాలంటే మీరు ఇంటి ఓనరు పెట్టే పరీక్షలో పాస్ కావాల్సిందే. గూగుల్ (Google) లాంటి పెద్ద కంపెనీలు నిర్వహించే ఇంటర్యూలో పాస్ కావడం ఈజీ ఏమో కానీ.. బెంగళూరులో అద్దె ఇంటికోసం జరిగే పరీక్షలో పాస్ కావడం అంత ఈజీకాదు. ఈ విషయాన్ని గూగుల్ లో పనిచేసే రిపు డామన్ భడోరియా అనే వ్యక్తి లింక్డి న్ లో స్వయంగా పంచుకోవడం వైరల్ గా మారింది.

2022లో డామన్ భడోరియా సీటెల్ (Ripu Daman Bhadoria) నుంచి బెంగళూరికి మకాం మార్చాలి అనుకున్నాడు. అందులో భాగంగా అద్దె ఇంటికోసం తెగ వెతికాడు. పోస్ట్ కోవిడ్ తర్వాత అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగిన కారణంగా ఇల్లు దొరకడం అతనికి కష్టమైంది. అతని ప్రయత్నం ఫలించి ఇల్లు నచ్చితే అక్కడి నుంచి అద్దె ఇళ్ల ఓనర్లు ఇంటర్వ్యూ (Interview) చేయడం మొదలుపెట్టారు.

Viral Video: ఏనుగుల గుంపు హాయిగా ఎలా నిద్రపోతుందో చూశారా.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో

ఈ నేపథ్యంలోనే ఓ ఇంటి ఓనర్ పెట్టిన పరీక్షలో భడోరియా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అందుకు కారణం తెలుసుకుని ఆశ్చర్యపోవడం భడోరియా వంతైంది. గూగుల్ లో పనిచేస్తూ సొంత ఇల్లు కొనుగోలు చేసే స్థోమత ఉండీ అద్దె ఇంటితో నీకేమవసరం? అని ఇంటి యజమాని చెప్పిన సమాధానం విని భడోరియా నోరెళ్లబెట్టాడు. గూగుల్ లో పనిచేయడంవల్ల ఇలాంటి సమస్య వస్తుందని తాను అనుకోలేదని భడోరియా వాపోయాడు. అదే సమయంలో కింది పోర్షన్ లో అద్దె ఇంటి కోసం వచ్చిన మరో వ్యక్తి ఓనర్ పెట్టిన పరీక్షలో పాస్ అవ్వడం విశేషం. ఎవరైనా బెంగళూరులో అద్దె ఇల్లు కావాలంటే ఎదుర్కోవాల్సిన ఇంటర్వ్యూ వివరాల కోసం తనని సంప్రదించాల్సిందిగా భడోరియా చెప్పడం ఇతని కష్టానికి కొసమెరుపు. ఇంతకీ భడోరియాకి అద్దె ఇల్లు దొరికిందో లేదో..?

ట్రెండింగ్ వార్తలు