CEO Challenges Employees: ‘బరువు తగ్గినవారికి… రూ.10 లక్షలు ఇస్తాను’.. ఉద్యోగులకు ఓ కంపెనీ సీఈవో బంపర్ ఆఫర్
అనారోగ్య జీవన విధానం, ఇష్టం వచ్చింది తింటుండడం వల్ల బరువు పెరిగిపోవడం, దాని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుండడం పెద్ద తలనొప్పిగా మారింది. ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగులు సమర్థంగా పనిచేస్తారు. ఆయా అంశాలను గుర్తించిన ఓ కంపెనీ సీఈవో ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బరువు తగ్గితే రూ.10 లక్షల వరకు రివార్డులు అందుకోచ్చని చెప్పారు. ప్రతిరోజు కనీసం 350 కెలోరీలు కరిగించాలని అన్నారు.

CEO Challenges Employees: అనారోగ్య జీవన విధానం, ఇష్టం వచ్చింది తింటుండడం వల్ల బరువు పెరిగిపోవడం, దాని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుండడం పెద్ద తలనొప్పిగా మారింది. ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగులు సమర్థంగా పనిచేస్తారు. ఆయా అంశాలను గుర్తించిన ఓ కంపెనీ సీఈవో ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బరువు తగ్గితే రూ.10 లక్షల వరకు రివార్డులు అందుకోచ్చని చెప్పారు. ప్రతిరోజు కనీసం 350 కెలోరీలు కరిగించాలని అన్నారు.
ఆన్ లైన్ బ్రోకరేజ్ కంపెనీ జెరోధా సీఈవో నితిన్ కామత్ తమ ఉద్యోగులకు ఇచ్చిన ఈ ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. తాను ఉద్యోగులకు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి, పూర్తి చేసిన వారికి భారీగా పారితోషికాలు ఇస్తానని, వారిలో ఒకరికి రూ.10 లక్షలు కూడా అందుకోవచ్చని చెప్పారు. కంపెనీ ఫిట్ నెస్ ట్రాకర్స్ ద్వారా ఉద్యోగులు తమ బరువు, కరిగించే కేలరీల గురించి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని అన్నారు. ఫిట్ నెస్ ఛాలెంజ్ లో గెలుపొందిన వారికి ఒక నెల జీతాన్ని బోనస్ గా ఇస్తానని చెప్పారు.
చాలా మంది ఈ ఛాలెంజ్ ను పూర్తి చేస్తే వారిలో ఒక లక్కీ పార్టిసిపెంట్ కు రూ.10 లక్షలు అందుతాయని అన్నారు. ఇంటి నుంచి పనిచేస్తున్న తమ ఉద్యోగులు ఆరోగ్యం విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి తమ సంస్థ ప్రోత్సహిస్తోందని చెప్పారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లోనూ జెరోధా కంపెనీ ఉద్యోగులకు ఆరోగ్యం విషయంలో ఓ ఆఫర్ ఇచ్చింది. శరీర ఎత్తుకు తగ్గ బరువును తెలిపే బీఎంఐ 25 కంటే తక్కువగా ఉన్నవారికి 15 రోజుల జీతం బోనస్ గా ఇస్తామని ప్రకటించింది.
Make-in-India: మేకిన్ ఇండియా ఫలితం.. 636 శాతం పెరిగిన బొమ్మల ఎగుమతులు