వైరల్ : ప్రేమ కోసం 2 వేల కిలోమీటర్లు ప్రయాణం

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 06:28 AM IST
వైరల్ : ప్రేమ కోసం 2 వేల కిలోమీటర్లు ప్రయాణం

సాధారణంగా పక్షులు, జంతువులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్తాయని మనకి తెలుసు. సీజన్ లో వచ్చే మార్పుల వల్ల గాని, జీవనం సాగించటం కోసం గాని వలసపోతాయి. తాజాగా ఓ పులి తన తోడును వెతుకుంటూ ఒకటి, రెండు కాదు ఏకంగా 2వేల కిలోమీటర్లు నడిచిన పులి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పులి తన గమ్యం ఎక్కడికో తెలియని ఓ బాటసారిలాగా తన తోడును వెతుకుంటూ తన ప్రయాణాన్ని సాగిస్తోంది. అలా అడ్డం వచ్చిన కొండలు, పొలాలు, కాలువలు, అడవులు, రోడ్లు దాటుతూ పోతుందని పర్వీన్ కస్వాన్ అన్నారు. ఆ పులి పగలు నిద్రపోయి, రాత్రి పూట తన ప్రయాణాన్ని కొనసాగించేది. అలా రెండు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ చివరకు ధ్యానగంగా అటవీ ప్రాంతంలో తన ప్రయాణాన్ని ముగించింది.

పర్వీన్ కస్వాన్ ఈ విషయాన్ని షేర్ చేస్తూ… ఆ పులికి జీపీఎస్ అమర్చినట్లు తెలిపారు. దాని ద్వారా ఆ పులి ఎంత దూరం ప్రయాణించిందనే విషయాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు. ఆ పులి ఎక్కడి నుంచి ఎటువైపుగా వెళ్లిందో తెలిపే ఓ మ్యాప్ ఆధారంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం పులిని తన బంధువులు వెళ్లగొట్టారంటూ అందుకే పారిపోతుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.