టిక్ టాక్ వైరల్ వీడియోస్ 2019

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 06:49 AM IST
టిక్ టాక్ వైరల్ వీడియోస్ 2019

చైనా కంపెనీ 2019 ప్రవేశపెట్టిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్… ఈ యాప్ కు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీని వల్ల చాలామందికి చాలా సమస్యలు వచ్చాయి. అయినా గానీ 30 కోట్ల మందికి పైగా యూజర్లను సంపాదించిన యాప్ టిక్ టాక్. అయితే సంవత్సరం పూర్తి చేసుకున్న టిక్ టాక్… ప్రత్యేకమైన వైరల్ వీడియోలతో దుమ్మురేపుతోంది.

సాధారణంగా ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటే వినే ఉంటారు. అయితే టిక్ టాక్ యాప్ ద్వారా నిజంగానే ఉంటారని తేలింది. సినిమా స్టార్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను పోలినవారిని మీరు ఈ యాప్ లో చూడొచ్చు.

మనిషిని పోలిన మనిషులు: ఫిబ్రవరిలో రిలీజైన గల్లీ బాయ్ సినిమాలో నటించిన రన్ వీర్ సింగ్, ఆలియాభట్ ల పోలికలతో ఉన్న వ్యక్తులు టిక్ టాక్ లో వీడియోలు చేసి పోస్ట్ చేశారు. వారిని చూసిన నెటిజెన్లు అందరూ షాక్ అవుతున్నారు. మీరు అచ్చం రన్ వీర్ సింగ్, ఆలియాభట్ లాగనే ఉన్నారు అంటూ రిప్లే కూడా ఇస్తున్నారు. అంతేకాదు విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తి కూడా ఉన్నాడు. మరి ఆ వైరల్ వీడియోలపై మీరు ఓ లుక్కేయండి.

 

* రోజు టిక్ టాక్ ఉపయోగించే సెలబ్రెటీలు:
టిక్ టాక్ యాప్ ను సమాన్య ప్రజలు మాత్రమే కాదు సినీ ప్రముకులు కూడా తెగ వాడేస్తున్నారు. కాలీ దొరికితే చాలు వెంటనే టిక్ టాక్ ఓపెన్ చేసి వీడియో చేయడం.. అప్లోడ్ చేయడం. మరి ఆ సెలబ్రెటీలు ఎవరో చూద్దామా.

 

* టిక్‌టాక్‌లో సంచలనంగా మారిన మరో వీడియో ఏమిటంటే, యాసిడ్ దాడి తర్వత ప్రాణాలతో బయటపడిన లక్ష్మి అగర్వాల్ చం చం సాంగ్ కి అద్భుతంగా వేసిన డ్యాన్స్ వీడియో.

* వీళ్లందరినీ పక్కన పెడితే సెలబ్రెటీలకు మాత్రమే కాదు మాకు టాలెంట్ ఉందంటూ.. కొంతమంది వారి టాలెంట్ ను ఈ యాప్ ద్వారా అందరి దృష్టికి తీసుకువస్తున్నారు. మరి ఓ వ్యక్తి బ్రేక్ డ్యాన్స్ ఎంత బాగా చేశాడో మీరు చూడండి.

* ఇవన్నీ చూసేసారుగా మరి ఈ వీడియోలతో పాటు కొన్ని ఫన్నీ వీడియోలను కూడా చూసి కడుపుబ్బా నవ్వేయండి.