రెండు భారీ షిప్‌లు ఢీ: వైరల్ వీడియో

రెండు భారీ షిప్‌లు ఢీ: వైరల్ వీడియో

సముద్ర ప్రయాణమంటే రిస్క్‌లతో కూడుకున్న వ్యవహారం. ప్రయాణంలో అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటీవల మెక్సికోలో రెండు భారీ షిప్పుల మధ్య జరిగిన ప్రమాదంలో కొద్దిపాటిలో ఎటువంటి ప్రాణాపాయం తప్పింది. ఇరు షిప్పుల డ్రైవర్లు చాలా ప్రయత్నించినా మరో షిప్‌ను రాసుకుంటూ వెళ్లిపోయింది. ఉదయం 8గంటల 30నిమిషాల సమయంలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

గ్లోరీ అనే షిప్ పోర్ట్ చేరుకుంది. అదే సమయంలో పోర్ట్ నుంచి బయల్దేరేందుకు సిద్ధమవుతోన్న కార్నివాల్ లెజెండ్ వెనుకకు తీసుకుంది. ఈ రెండూ ఒకేసారి కదులుతుండటంతో ముందుగానే ఏదో ప్రమాదం జరుగుతుందని అంతా అనుకున్నారు. చివరి వరకూ క్షేమంగానే వెళ్లిన షిప్ దాని అంచుల నుంచి అవతలి షిప్ కొసలను తాకుతూ వెళ్లింది. ఫలితంగా గ్లోరీ షిప్ రైలింగ్, కిటికీలు మొత్తం ధ్వంసమైపోయాయి. 

మరో వీడియోలో ఒయాసిస్ అనే షిప్.. ఈ లెజెండ్ తో ఇంకో స్టంట్ చేసింది. కార్నివాల్ గ్లోరీకి చెందిన అధికారులు మాట్లాడుతూ.. ‘కార్నివాల్ గ్లోరీ.. కార్నివాల్ లెజెండ్ ను ఢీకొట్టింది. చాలా దూరం వెళ్లినప్పటికీ ప్రమాదం జరుగకుండా ఆపలేకపోయాం. ఈ కారణంగా షిప్ కు పెద్ద ప్రమాదమేమి లేదని అనుకుంటున్నాం. రెండు షిప్ లలో ఉన్న ప్రయాణికులకు అదే చెప్తున్నాం. ఎటువంటి ఆందోళనకు లోను కాకుండా వారి ట్రిప్ ఎంజాయ్ చేయాలని’ అని వెల్లడించారు. ఒక్కసారిగా గ్లోరీ 3వేల మంది పడుకోవచ్చు. మరో తరగతి పెట్టెలో వెయ్యి మంది పడతారు.