వరదతో పోటెత్తిన నదిలో అమ్మాయిల సెల్ఫీ..కాపాడేందుకు పోలీసులొచ్చినా సెల్ఫీ తీసుకుంటూనే..

  • Published By: nagamani ,Published On : July 25, 2020 / 11:59 AM IST
వరదతో పోటెత్తిన నదిలో అమ్మాయిల సెల్ఫీ..కాపాడేందుకు పోలీసులొచ్చినా సెల్ఫీ తీసుకుంటూనే..

ఇద్దరుఅమ్మాయిలకు పట్టుకున్న సెల్ఫీ పిచ్చితో పెను ప్రమాదంలో పడ్డారు. వాళ్లను రక్షించటాకి ఏకంగా 15మందికి పైగా పోలీసులు బృందం తరలివచ్చింది. అయినా సరే ఆ అమ్మాయికు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. వారిద్దని రక్షించటానికి పోలీసులు తాళ్లతో..ఒకరికొకరు ఆసరాగా చేసుకుని అతి కష్టంమీద వరద ఉదృతిని కూడా లెక్క చేయకుండా వాళ్ల దగ్గరకు వస్తున్నా కూడా వాళ్లిద్దరూ సెల్ఫీలు దిగటం మానలేదు. మనకోసం ఏకంగా పోలీసులువచ్చారే..అన్నట్లుగా అదేదో ఘనకార్యంలాగా పెద్ద ఫోజులు కొట్టుకుంటూ సెల్ఫీలు దిగుతూనే ఉన్నారు. ఈ ఘటన గురువారం (జులై 23,2020)న మధ్యప్రదేశ్ లో జరిగింది.

రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలోని బేలాఖేడి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు సెల్ఫీ మోజులో ఆ గ్రామానికి సమీపాన ఉన్న పెంచ్ న‌ది మ‌ధ్య‌లో ఉన్న రాళ్ల‌పైకి వెళ్లారు. ఆ రాళ్లపై సెల్ఫీ తీసుకుంటుడ‌గా న‌దిలో వ‌ర‌ద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. భారీగా వరద నీరు ఉరికి ఉరికి వస్తోంది. దీంతో ఇద్ద‌రు వ‌ర‌ద‌లోనే చిక్కుకుపోయారు. ఇద్దరు అమ్మాయిలు వరదలో చిక్కుకుని ఉండడాన్ని గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు హుటాహుటినా ఘటనస్థలికి చేరుకొని ఆ అమ్మాయిలను కాపాడేందుకు యత్నించారరు.

అమ్మాయిలిద్దరినీ రక్షించటానికి పోలీసులు నానా పాట్లు పడ్డారు. కాలేజీలకు సెలవులు ఇవ్వటంతో భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న నదిని చూడడానికి వచ్చామని..లొకేషన్ బాగుండడంతో రిస్క్ చేసి సెల్ఫీ దిగడానికి వెళ్లామన్నారు. ఇంకోసారి ప్రమాదకరమైన ప్రదేశాలకు సెల్ఫీల కోసం వెళ్లకూడదని పోలీసులు ఆ యువతులకు కౌన్సలింగ్ ఇచ్చారు.