’కీ’ఇవ్వటం లేటైంది సారీ.: 47 ఏళ్ల క్రితం పట్టుకెళ్లి ‘తాళం చెవి’ పార్శిల్ పంపిన వ్యక్తి

  • Published By: nagamani ,Published On : December 11, 2020 / 12:04 PM IST
’కీ’ఇవ్వటం లేటైంది సారీ.: 47 ఏళ్ల క్రితం పట్టుకెళ్లి ‘తాళం చెవి’ పార్శిల్ పంపిన వ్యక్తి

UK Mystery returns 11th century tower key for 50 years : ఎవరిదైనా తాళం చెవి అనుకోకుండా తీసుకునిగానీ..లేదా వేరే కారణాలతో గానీ పట్టుకెళ్లిపోతే..దాన్ని వెంటనే తిరిగి ఇచ్చేస్తాం. అలా వెంటనే ఇవ్వటం కుదరకపోతే..రెండు మూడు రోజుల తరువాత ఇస్తాం.అంతగా కాకుంటే మరో వారం రోజులు పడుతుందేమో. కానీ ఓ వ్యక్తి మాత్రం తాను తీసుకెళ్లిపోయిన తాళం చెవిని దాదాపు 50 సంవత్సరాల తరువాత ఆ తాళం చెవికి సంబంధించిన వ్యక్తి పార్శిల్ ద్వారా పంపించాడు.



 

ఎప్పుడో 1973వ సంవత్సరంలో పట్టుకెళ్లిన తాళం చెవిని తిరిగి ఇచ్చేయాలనుకుని ఆ కీని పార్శిల్ చేసి పంపిస్తూ..‘‘సారీ తాళం చెవి ఇవ్వటానికి ఆలస్యం అయ్యింది ఏమీ అనుకోవద్దు’’ అంటూ ఓ లెటర్ కూడా రాసి పంపించాడు. ఈ వింత ఘటన ఇంగ్లండ్‌లో జరిగింది.



వివరాల్లోకి వెళితే..ఇంగ్లండ్ లోని కెంట్‌లో 11వ శతాబ్దానికి చెందిన సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌ ఉంది. అది వారసత్వంగా వచ్చే టవర్. దాని తాళం చెవిని 47 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి తీసుకెళ్లిపోయాడు. అది ఏరకంగా ఎందుకు తీసుకెళ్లాడో తెలీదు గానీ..ఆనాటి నుంచి అప్పటి నుంచి దాన్ని తిరిగి ఇవ్వలేదు. కానీ ఇన్నాళ్టికి ఆ తాళం చెవిని తిరిగి సదరు సంబంధిత వ్యక్తికి తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు.



 

ఆ తాళం చెవిని..దానితో పాటు క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ కూడా రాసి పార్శిల్ చేసి పంపించాడు. సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌ నిర్వాహకులకు ఓ పార్సిల్‌ రావడంతో దాన్ని విప్పి చూశారు. అందులో తాళం చెవి ఉండడంతో ఆశ్చర్యపోయారు. ఇది దశాబ్దాల క్రితం నాటిదని గుర్తించారు.



 

అనంతరం పార్శిల్ లో ఉన్న లెటర్ కూడా చదివారు. ఆ లెటర్ లో సదరు వ్యక్తి క్షమాపణలు చెబుతూ.. సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌కు చెందిన తాళం చెవిని తిరిగి తీసుకోండని కోరాడు. ఆ తాళం చెవిని తాను 1973లో తీసుకున్నానని…దాన్ని తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నానని..ఆలస్యం అయినందుకు క్షమించాలని కోరాడు.



దీనిపై చారిటీ సంస్థ ఇంగ్లిష్‌ హెరిటేజ్‌ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆ లేఖ, తాళం చెవిని పోస్టు చేసింది. 47 ఏళ్ల క్రితం తీసుకున్న తాళం చెవిని ఇప్పుడు తిరిగి ఇచ్చాడని ఇది చాలా సుదీర్ఘకాలమని పేర్కొంది. కానీ ఇంతకాలం తరువాత అతను దాన్ని తిరిగి ఇవ్వాలనుకోవటం మంచిదేనని..కానీ చాలా అంటే చాలా లేట్ అయ్యిందని..అయినప్పటికీ దాన్ని ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు అంటూ తెలిపింది.



దాన్ని తిరిగి ఇచ్చేందు ఆలస్యమైందని బాధపడాల్సిన పనే లేదేని చెప్పింది. ఎందుకంటే వాటి తాళాలను ఎప్పుడో మార్చేశామని స్పష్టంచేసింది. ఆ అజ్ఞాత వ్యక్తి తన వివరాలను పంపాలని ఆ సంస్థ కోరింది. మరి, ఇప్పుడైనా సదరు తాళంచెవి తీసుకున్న వ్యక్తి తన పేరు చెబుతాడా? వివరాలు చెబుతాడా? అసలెందుకు ఆ తాళం చెవి పట్టుకెళ్లాడు? ఏ కారణంతో పట్టుకెళ్లాల్సి వచ్చిందో చెబుతాడేమో చూద్దాం..!



1077-1108 మధ్య నిర్మించిన టవర్‌ కు సంబంధిచిన ఈ తాళం చెవి అన్నేళ్ల తరువాత తిరిగి పంపించిన విషయం చాలా ఆసక్తి కలిగిస్తోంది. కాగా..ఈ ఇంగ్లీష్ హెరిటేజ్ ఈ కీ, సుమారు 100 సంవత్సరాల వయస్సు ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎప్పుడో 47 ఏళ్ల క్రితంనాటి ఈ తాళం చెవి అంశం మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది.