మార్కుల దానం: ఆన్సర్ పేపర్‌లో స్టూడెంట్ రిక్వెస్ట్.. టీచర్ ఫిదా!

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 06:07 AM IST
మార్కుల దానం: ఆన్సర్ పేపర్‌లో స్టూడెంట్ రిక్వెస్ట్.. టీచర్ ఫిదా!

పరిక్షల్లో తోటి విద్యార్ధికి సాయం చెయ్యడం నేరం.. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇతరులకు సాహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనను మాత్రం తప్పు పట్టలేం కదా? ఓ విద్యార్ధి పరీక్ష పేపర్ పై టీచర్ కు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అమెరికాలోని ఓ స్కూల్ టాప్ విద్యార్ధి పరీక్ష పేపర్ పై తనకి వచ్చిన బోనస్ పాయింట్లను పరీక్షలో తక్కువ మార్కులు సాధించిన వారికి యాడ్ చేయాలని టీచర్ కు విజ్ఞప్తి చేస్తాడు. ఆ వ్యక్తి A+ స్టూడెంట్ కావటం విశేషం. ఆ స్టూడెంట్ చేసిన విజ్ఞప్తికి క్లాస్ టీచర్ విన్ స్టన్ లీ ని ఫిదా అవుతాడు.

ఆ స్టూడెంట్ కి 94 మార్కులు వచ్చినందుకు అదనంగా 5 బోనస్ మార్కులు యాడ్ అవుతాయి.దాంతో ఆ స్టూడెంట్ స్కోర్ కాస్తా 99 అవుతుంది.కానీ ఆ స్టూడెంట్ మాత్రం తనకి అలా అదనంగా వచ్చే మార్కులను తమ తరగతిలో ఎవరికైతే తక్కువ మార్కులు వస్తాయో వారికి యాడ్ చేయండి అంటూ టీచర్ ని కోరాడు. 

ఆ స్టూడెంట్ కోరికను కాదనలేక విన్ స్టన్ లీ మార్కులను ఓ బాలికకు కలిపాడు.దాంతో ఆ బాలిక కూడా A+ గ్రేడ్ ని పొందింది.ఇతరులకు సాయం చేయాలనే ఆ స్టూడెంట్ ఆలోచనకు విన్ స్టన్ లీకి చాలా బాగా నచ్చింది. దాంతో ఆ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు.దాంతో నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.