బరువు తగ్గలేదని.. డైట్ సోడా బ్రాండ్ పై మహిళ దావా!

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 11:18 AM IST
బరువు తగ్గలేదని.. డైట్ సోడా బ్రాండ్ పై మహిళ దావా!

కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ బరువు తగ్గబం కోసమని 13 సంవత్సరాల  నుంచి ఓ లాస్ వెయిట్ సోడా వాడుతుంది.. కానీ ఆమెకు ఏమాత్రం రిజల్ట్ కనిపించకపోవడంతో.. ఆ బ్రాండ్ పై ఆమె కోర్టులో కేసు వేసింది. అయితే ముగ్గురు న్యాయమూర్తులు కూడిన కాలిఫోర్నియా 9వ సర్కుట్ అప్పియల్స్ కోర్టు ఈ కేసును రిజెక్ట్ చేసింది. 

కోర్టు ఏం చెప్పిందంటే.. ఈ డైట్ సోడా కేవలం సాఫ్ట్ డ్రింక్ మాత్రమే.. బరువు తగ్గడానికి ఇది సహాయం చేయదని చెప్పింది. అందరూ సాఫ్ట్ డ్రింక్స్ పైన డైట్ అనే పదాన్ని చూసి బరువు తగ్గుతామనుకుని వాడుతున్నారని.. అది ఏ మాత్రం నిజం కాదని తెలిపింది.

న్యూయార్క్ రిపోర్టర్ మాట్లాడుతూ.. డైట్ డ్రింక్స్ అంటే ‘రెగ్యులర్’ డ్రింక్స్ కంటే తక్కువ కేలరీలు కలిగిన డ్రింక్ అని.. బరువు తగ్గడానికి సహాయపడే డ్రింక్ కాదని చెప్పారు. షానా బాసెరా ఈ డ్రింక్ పై ఉన్న డైట్ అనే పదాన్ని చూసి.. ఆమె బరువు తగ్గుతాననే ఆశతో ఈ డ్రింక్ ను దాదాపు 13 సంవత్సరాలు వాడిందని చెప్పారు.