100 రోజులు సేమ్ డ్రెస్​ వేసుకుని మెసేజ్ ఇచ్చిన మహిళ : ప్రశంసిస్తున్న జనాలు

100 రోజులు సేమ్ డ్రెస్​ వేసుకుని మెసేజ్ ఇచ్చిన మహిళ : ప్రశంసిస్తున్న జనాలు

US Woman wears same black dress for 100 days in a row : అమెరికాకు చెందిన ఓ మహిళ లెక్చరర్ కొత్త రకమైన చాలెంజ్​ను తీసుకున్నారు. 100 రోజులుగా సేమ్ డ్రెస్ వేసుకుని సరికొత్త ఫ్యాషన్ గురించి కొత్త చర్చ రేపారు. అంతేకాదు తను తీసుకన్న ఛాలెంజ్ పర్యావరణానికి మేలు చేస్తుందనే కొత్త ఆలోచనను రేకెత్తించారు. అదేంటీ ఒకే డ్రెస్ వేసుకుంటే పర్యావరణానికి మేలు జరగటమేంటీ? దానికి దీనికి సంబంధమేంటనే డౌన్ వచ్చే ఉంటుంది. మరి ఆ సరికొత్త ఆలోచ ఏంటో తెలుసుకుందాం..

అమెరికాలోని బోస్టన్​లోని ఓ కాలేజీలో లెక్చరర్​గా పని చేస్తున్న సారా రాబిన్స్​ కోల్ 100 రోజులుగా సేమ్ డ్రెస్ ధరించారు. ప్రస్తుతం కాలంలో ఫ్యాషన్ అనేది చాలా ఫాస్టుగా మారిపోతోంది. ఈక్రమంలో ఫ్యాషన్లు మారటం మంచిదే కానీ..ఫ్యాషన్లు మార్చకుండా ఉండేందుకు ఈ చాలెంజ్ తీసుకున్నానని..ఇది పర్యావరణానికి చాలా మంచి చేస్తుందని తెలిపారు. పత్తిని పండించేందుకు ఎంతో నీరు ఖర్చువుతోంది..అయితే దుస్తులు ఎక్కువగా కొనడం వల్ల నీరు వృథా అవుతుందని తెలిపారు. ఈ కొత్త పాయింట్ ను ఇప్పుడు జనాలనుఆలోచింపజేస్తోంది.

గత సంవత్సరం తన బర్త్ డే రోజు నుంచి క్రిస్మస్ వరకు ఆమె అదే రీతిలో ఉండే డ్రెస్ వేసుకునే వారు. సందర్భాన్ని బట్టి మిగిలిన కాస్త మార్పులు చేసుకురేవారు సారా రాబిన్స్. దానికి సంబంధించిన తన తన ఫొటోలన్నింటినీ ​@thisdressagain అనే ఇన్​స్టాగ్రామ్​లో రాబిన్ కోల్స్ పోస్ట్ చేస్తున్నారు.

తాను ఎలా రెడీ అవుతున్నానో చెప్పేవారు. మోకాళ్ల వరకు ఉండే రెండు లేయర్లుగా లాంగ్ స్లీవ్ బ్లాక్ డ్రెస్​ను​ ధరిస్తు..సందర్భాన్ని బట్టి గౌన్​, ఇతర వస్తువులు అలంకరించుకునే తప్ప పై డ్రెస్ మాత్రం సేమ్ అలాంటిదే ఉంటుంది.

“నిద్ర పోతున్నప్పుడు, ఎక్సర్ సైజులు చేస్తున్నప్పుడు తప్పించి మిగతా అన్ని వేళల్లో ఇదే డ్రెస్ ధరించానని సారా తెలిపారు. దీంతో ఉతికేందుకు చాలా తక్కువ బట్టలు ఉండేవని దీంతో ఖర్చుతో పాటు పనికూడా తప్పేదని ఈ కొత్త అనుభవం చాలా తమాషాగా అనిపించిందని తెలిపారు సారా. నేను ఇలా చేయడానికి ఇదీ ప్రధాని కారణం నీటి పొదుపు కోసం.” అని సారా తన సోషల్ మీడయాలో రాసుకొచ్చారు.

కరోనా లాక్​డౌన్ సమయంలో ఇలా చేయడం వెరీ ఫన్నీగా..తమాషాగా అనిపించిందని..అన్నారు. గత సెప్టెంబర్ 16న సారా ఈ చాలెంజ్​ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె తన ఎక్స్​పీరియన్స్​ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆమెతో పాటు మరికొందరు కూడా క్లాతింగ్ రిటైలర్ వూల్​& కార్యక్రమంలో భాగంగా ఈ చాలెంజ్ స్వీకరించి పాటిస్తున్నారు.

US Woman wears same black dress for 100 days in a row

జీవితంలో తక్కువ ఉన్నా సంతృప్తి చెందాన్న కాన్సెప్ట్​తో ఈ చాలెంజ్​ ను ప్రోత్సహించినట్టు ఆ బ్రాండ్ తెలిపింది. రొవెనా స్వింగ్ డ్రెస్ ధరించి చాలెంజ్​ పూర్తి చేసిన వారికి ఆ సంస్థ 100డాలర్ల కార్డును బహుమతిగా ఇచ్చింది.100 రోజులు ఒకే తీరుగా ఉన్న డ్రెస్ వేసుకున్నంత మాత్రాన తన జీవితంలో ఏం కోల్పోయినట్టు లేదని..పైగా 2021లో కొత్త డ్రెస్సులు కొనకుండా ఈ ఛాలెంజ్ స్ఫూర్తినిచ్చిందని రాబిన్ కోల్స్ తెలిపారు.

ఇంటిలో తనకున్న ఎన్నో ఉపయోగం లేకుండా డ్రెస్సులు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయో..ఇటువంటి సమయంలో ఈ సరికొత్త చాలెంజ్ నన్ను ఆలోచింపజేసింది. కాటన్​ను పండించేందుకు ఎంత నీరు ఖర్చవుతోంది. మనం కొనే బట్టలు ఎథికల్​గా తయారు చేశారో లేదో కూడా తెలియదని రాబిన్​ కోల్స్ తెలిపారు.

ప్రస్తుతం తన దారిలోనే చాలా మంది నడుస్తున్నారని..ఇది చాలా సంతోషించదగిన విషయమని దీనిపై అవగాహన పెరగాలని ఆమె అన్నారు. కాగా రాబిన్ కోల్స్​పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చాలెంజ్ సూపర్​ గా ఉందని..తాము ట్రై చేస్తామని తమ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.