Vaccinated Groom : వరుడు కావలెను- ఆ వ్యాక్సిన్ 2 డోసులు వేసుకుని ఉండాలి

పెళ్లి కావల్సిన వధువు తనకు కాబోయే వరుడు గురించి ఇచ్చిన పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Vaccinated Groom : వరుడు కావలెను- ఆ వ్యాక్సిన్ 2 డోసులు వేసుకుని ఉండాలి

Vaccinated Groom

Vaccinated Groom : కరోనా వైరస్ వ్యాపించిన గతేడాది నుంచి ఫన్నీ,ఫన్నీ కామెంట్లు,సెటైర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పెళ్లి కావల్సిన వధువు తనకు కాబోయే వరుడు గురించి ఇచ్చిన పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ప్రకటనలో తన వివరాలు చెప్పింది. తనకు కాబోయే భర్తకు  ఉండాల్సిన క్వాలిఫికేషన్లు చెప్పింది. అంతా బాగానే ఉంది. కానీ అక్కడే తనలోని క్రియేటివిటీ చూపించింది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వరుడు కావాలని… అదీ 2 డోసులు వేయించుకుని ఉండాలని షరతు పెడుతూ  ప్రకటన ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తెగ నవ్వు తెప్పిస్తోంది.