Sarpanch Rally On Donkey : సర్పంచ్‌ను గాడిదపై ఊరేగించి పండుగ చేసుకున్న గ్రామస్తులు

తమ గ్రామ సర్పంచ్‌ను గాడిదపై ఊరేగించి పండుగు చేసుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అదేంటి గాడిదపై ఊరేగించి పండగ చేసుకోవటం ఏంటి అంటారా.. ఎక్కడైనా తప్పు చేసిన వాళ్లను గాడిదపై ఊరేగించి పరువు తీస్తారు... వీళ్లు సర్పంచ్ ను ఊరేగించి పండగ చేసుకోవటం ఏంటి అనుకుంటున్నారా.

Sarpanch Rally On Donkey : సర్పంచ్‌ను గాడిదపై ఊరేగించి పండుగ చేసుకున్న గ్రామస్తులు

Sarpanch Rally On Donkey

Sarpanch Rally On Donkey : తమ గ్రామ సర్పంచ్‌ను గాడిదపై ఊరేగించి పండుగు చేసుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అదేంటి గాడిదపై ఊరేగించి పండగ చేసుకోవటం ఏంటి అంటారా.. ఎక్కడైనా తప్పు చేసిన వాళ్లను గాడిదపై ఊరేగించి పరువు తీస్తారు… వీళ్లు సర్పంచ్ ను ఊరేగించి పండగ చేసుకోవటం ఏంటి అనుకుంటున్నారా… అది అంతే…. ఆ గ్రామ ఆచారం. దేశవ్యాప్తంగా భారీవర్షాలతో తడిసి ముద్దవుతున్నా మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో మాత్రం ఆశించినంత స్ధాయిలో వానలు పడటంలేదుట.

వర్షాల కోసం మనకు తెలిసినంతలో కప్పలకు పెళ్లి చేయటం తెలుసు మనకు. కానీ వానల కోసం మధ్య ప్రదేశ్ లోని ఆగ్రామంలో….తమ గ్రామ సర్పంచ్‌ను గాడిదపై కూర్చోపెట్టి ఊరేగింపు నిర్వహించారు. మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లా రంగా గ్రామంలో అనాదిగా ఓ ఆచారం కొనసాగుతూ వస్తోంది. వర్షాల కోసం గాడిదపై సర్పంచ్‌ గ్రామమంతా ఊరేగాలనే సంప్రదాయం ఉంది. ప్రస్తుతం ఆ జిల్లాలో వర్షాలు సక్రమంగా కురవడం లేదు.

దీంతో గ్రామస్తులు అందరూ కలిసి సర్పంచ్‌ సుశీల్‌ వర్మకు గత సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. ఆయన అందుకు సరే అన్నాడు.   అనుకున్నదే తడువుగా ఒక గాడిదను తీసుకుని వచ్చి దానికి పూజాదికాలు నిర్వహించారు.  అనంతరం సర్పంచ్‌ సుశీల్‌ వర్మ గాడిదపై కూర్చున్నారు.  గ్రామస్తులంతా కలిసి  ఆయన్ని గ్రామంలో ఉరేగిస్తూ తిరిగారు. పటేల్‌ బాబా ఆలయం నుంచి గణేశ్‌ మందిరం వరకు ఊరేగింపు చేపట్టారు. ఈలలు.. కేకలు వేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఊరేగింపు ముగిసిన తర్వాత  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని గ్రామస్తులంతా ప్రార్థించారు. ఈ కార్యక్రమం అనంతరం సర్పంచ్‌ సుశీల్‌ వర్మ స్పందించి ఆ ఆనవాయితీ గురించి వివరించారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో మాకు వింత ఆచారం ఉంది. గ్రామ అధిపతి (సర్పంచ్‌) గాడిదపై స్వారీ చేస్తే వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే గాడిదపై స్వారీ చేశా. ఒక ప్రజాప్రతినిధిగా గ్రామస్తుల సమస్య పరిష్కరించడం నా బాధ్యత. అందుకే గాడిదపై ఊరేగి వరుణదేవుడిని ప్రార్థించా’ అని తెలిపారు.