Fact Check: అంబానీ ఇంట్లో పార్టీ.. టిష్యూ పేపర్ల స్థానంలో కరెన్సీ నోట్లు?

రాత్నిష్ అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోలను తన వాల్ మీద షేర్ చేస్తూ ‘అంబానీ ఇంట్లో పార్టీ అంటే టిష్యూ పేపర్ల స్థానంలో 500 రూపాయల నోట్లు ఉంటాయి మరి’ అని రాసుకొచ్చాడు. కొందరేమో గుడ్డిగా ఇది నిజమే అనుకుని అంబానీ ఆస్తి అలాంటిదని వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరేమో కరెన్సీని అలా ఉయోగించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Fact Check: అంబానీ ఇంట్లో పార్టీ.. టిష్యూ పేపర్ల స్థానంలో కరెన్సీ నోట్లు?

viral tweet about ambani party

Fact Check: అంబానీ కుటుంబ జీవన శైలి గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. ఆ కుటుంబం ఏం చేసినా అది వెంటనే వార్తగా మారుతుంటుంది. నిజాలో, అబద్ధాలో అంబానీ కుటుంబం గురించి అంటే ఇట్టే ప్రచారంలో ఉండిపోతుంటాయి. అప్పట్లో ఎప్పుడో కిలో బెండకాయల్ని అంబానీ కోటి రూపాయలు కొన్నాడనే ప్రచారం జరిగేది. వీటిని నమ్మేవాళ్లు లేకపోలేదు. అందుకే ఇలాంటివి ప్రచారంలో ఉంటాయి. కాగా, అంబానీ ఇంట్లో తాజాగా జరిగిన ఓ వేడుకలో టిష్యూ పేపర్ల స్థానంలో కరెన్సీ నోట్లు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. స్వీట్ వేసిన కప్పును 500 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. అంటే, టిష్యూ పేపర్ ఉండాల్సిన చోట ఇలా కరెన్సీ నోట్లను పెట్టారన్నమాట.


రాత్నిష్ అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోలను తన వాల్ మీద షేర్ చేస్తూ ‘అంబానీ ఇంట్లో పార్టీ అంటే టిష్యూ పేపర్ల స్థానంలో 500 రూపాయల నోట్లు ఉంటాయి మరి’ అని రాసుకొచ్చాడు. కొందరేమో గుడ్డిగా ఇది నిజమే అనుకుని అంబానీ ఆస్తి అలాంటిదని వ్యాఖ్యానిస్తుండగా.. అందులోనే మరికొందరేమో కరెన్సీని అలా ఉయోగించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజంగా అంబానీ ఇంట్లో జరిగింది కాదండోయ్. ఢిల్లీలోని ఒక హోటల్‭లోని ఫొటోలు ఇవి. దౌలత్ కీ చాట్ అనే ఈ డిష్ ఉత్తర ఢిల్లీలో చాలా ఫేమస్. చలికాలంలో మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంది. ఇందులో భాగంగా ఓల్డ్ ఢిల్లీలోని ఒక హోటల్ లో ఇలా కరెన్సీ నోట్లతో అలంకరించి ఇస్తారు. ఇంకో ట్వీస్ట్ ఏంటంటే.. ఆ నోట్లు అసలు నోట్లు కాదు, ఫేక్ నోట్లు. కస్టమర్లకు కాస్త కొత్తగా ప్రత్యేకంగా ఉండేందుకు అలా చేస్తారట. అంబానీకి ఆస్తి ఉంది కాబట్టి డబ్బు గురించి ఏం చెప్పినా నమ్మేయకండే.. అప్పుడప్పుడు పెద్ద పెద్ద తప్పిదాలే జరుగుతుంటాయి.