పెంపుడు కుక్కకు క్యాన్సర్.. రూ.42.93 కోట్లు ఖర్చు పెట్టిన సీఈవో

పెంపుడు కుక్క కోసం దాని యజమాని  ‘వెదర్‌టెక్’ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్‌నైల్ కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టారు.

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 11:52 AM IST
పెంపుడు కుక్కకు క్యాన్సర్.. రూ.42.93 కోట్లు ఖర్చు పెట్టిన సీఈవో

పెంపుడు కుక్క కోసం దాని యజమాని  ‘వెదర్‌టెక్’ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్‌నైల్ కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టారు.

పెంపుడు కుక్క కోసం దాని యజమాని  ‘వెదర్‌టెక్’ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్‌నైల్ కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టారు. మ్యాక్ నైల్ గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క స్కౌట్‌ను పెంచుకుంటున్నారు. స్కౌట్ అంటే మ్యాక్‌నైల్ కు ప్రాణం. అటువంటి స్కౌట్ కు తీవ్ర అనారోగ్యానికి గురైంది. 

వెంటనే స్కౌట్ ను పశువుల డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. దాన్ని పరీక్షించిన డాక్టర్ దాని గుండెలో గడ్డ ఉందని..రక్తంలో క్యానర్ కణాలు ఉన్నాయని చెప్పారు. ట్రీట్ మెంట్ చేసినా స్కౌట్ బతికే అవకాశాలు ఒక శాతమే ఉన్నాయని చెప్పారు. 

దీంతో మ్యాక్‌నైల్ స్కౌట్‌ తనకు దక్కదేమోనని ఆందోళన పడ్డారు. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని..యూనివర్శిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌‌లో dచేర్చారు. అక్కడ స్కౌట్ కు కిమోథెరఫీ, రేడియేషన్ థెరఫీ, ఇమ్యునోథెరఫీ అందించారు డాక్టర్లు. దీంతో క్యాన్సర్ గడ్డ 90 శాతానికి కరిగిపోయి స్కౌట్ ఆరోగ్యం కుదుటపడింది. 
ఈ విషయం తెలియగానే మ్యాక్‌నైల్ సంతోషంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు. ఆ ఆనందంలో ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
 
‘యూనివర్శిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌’ డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పారు. అంతటితో ఊరుకుంటే పెద్ద విషయం ఏముంది? అది వార్త ఎలా అవుతుంది? 
డాక్టర్లకు థాంక్స్ చెప్పిన ఆయన అమెరికాలోని సూపర్ బౌల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ప్రకటన కోసం 6 మిలియన్ డాలర్లు (రూ.42,93,63,000) ఖర్చుపెట్టారు. కుక్కల్లో ఏర్పడే క్యాన్సర్ గురించి అవగాహన కలిపిస్తూ రూపొందించిన ఈ ప్రకటనలో స్కౌట్‌కు వైద్యం అందించిన వెటర్నరీ స్కూల్‌ అందించిన  ట్రీట్ మెంట్ గురించి వెల్లడించారు. ఈ ప్రకటన ద్వారా ఆ వెటర్నరీ స్కూల్‌కు విరాళాలు లభిస్తాయని ఆశిస్తున్నానని మ్యాక్‌నైల్ తెలిపారు.

 

పెంపుడు జంతువులను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. సొంతమనుషుల్లా చూసుకుంటాం. వాటికి చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతాం. కానీ మ్యాక్‌నైల్ తన పెంపుడు కుక్క కోసం పెట్టిన ఖర్చు గురించి తెలుసుకున్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఏదో పెంచుకున్నాంలే..ఇంతకాలం బతికింది..ఇంకేచేస్తాం అనుకోకుండా మ్యాక్‌నైల్ తన పెంపుడు కుక్కను దక్కించుకోవటానికి పడిన తపన గురించి తెలిసివారంతా అభినందిస్తున్నారు. క్యాన్సర్ కు గురై చావుబతుకులతో పోరాడుతున్న తన పెంపుడు కుక్కను బతికించిన వైద్యులకు ధన్యవాదాలు చెప్పేందుకు కోట్లు ఖర్చు పెట్టిన మ్యాక్‌నైల్ ఇప్పుడు స్కౌట్ తో కలిసి ఆనందంగా ఆడుకుంటున్నారు. డబ్బుంది కాబట్టి ఎన్నైనా చేస్తారు అనుకునేవారు కూడా పెంపుడు కుక్క కోసం  ‘వెదర్‌టెక్’ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్‌నైల్ పడిన తపనను ప్రశంసిస్తున్నారు.