వావ్.. ఇండియన్ అమేజాన్ అలెక్సా వాయిస్ కు రూపమిస్తే…. ఈ అమ్మాయే!

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 11:20 AM IST
వావ్..  ఇండియన్ అమేజాన్ అలెక్సా వాయిస్ కు రూపమిస్తే…. ఈ అమ్మాయే!

ఇంటర్నెట్‌ లో మనకు కావాల్సిన విషయాల గురించి తెలుసుకునేందుకు ప్రముఖ ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ అలెక్సా ఎకో పేరుతో ఆడియో డివైజ్‌ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మనకు తెలియని విషయాలన్నీ అలెక్సాను సులభంగా అడిగి తెలుసుకోవచ్చు. మనం అడిగిన ప్రతి విషయానికి అలెక్సా పూర్తి వివరణ ఇస్తుంది. 

alexa

ఇలాగే ఓ యువతి కూడా టిక్ టాక్ లో అచ్చం అలక్సా లాగానే మాట్లాడుతోంది. అలెక్సాకి అమ్మాయి రూపం ఇస్తే ఎలా ఉంటుందో. ఈ అమ్మాయి మాట్లాడుతుంటే కూడా అచ్చం అలాగే ఉంది. అలెక్సా వాయిస్ ఉపయోగించి ఆర్జే అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తూ.. సుప్రియా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.  

 

ఆ అమ్మాయి పేరు సుప్రియా కపూర్. తను ఓ వాయిస్ ఆర్టిస్ట్, ఇప్పటికే చాలా బ్రాండ్లకు, షోలకు యాడ్స్ చేసింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆమె 104.8 ఇష్క్ FMలో రేడియో జాకీగా పనిచేస్తోంది. వీడియోల్లో అలెక్సా ఎలా చేస్తుందో అదేవిధంగా ఆమె మాట్లాడుతోంది. ఆమె వాయిస్ కనుక మీరు వింటే.. నిజంగానే అలెక్సాకు వాయిస్ ఈమే చెబుతోందేమే అనే డౌట్ కూడా వస్తుంది.