పెంపుడు ప్రేమ: బాలికకు ముద్దు పెట్టిన కొండచిలువ

పెంపుడు ప్రేమ: బాలికకు ముద్దు పెట్టిన కొండచిలువ

Yellow Python Gives Little Girl Kiss Forehead 14645

పాముకు పాలు పోసి పెంచితే కాటేసే గుణం పోగొట్టుకోదు. ఇది పాత నానుడి. పెంపుడు జంతువులపై ప్రేమ పంచితే అవి కూడా అలాగే ప్రవర్తిస్తాయి. దీనికి సాక్ష్యమే ఈ ఘటన. పసుపు కొండచిలువ ఓ బాలిక నుదుటిపై ముద్దు పెట్టిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఏ మాత్రం బెరుకు లేకుండా వేరే వైపుగా పోతున్న పామును తన వైపుకు తిప్పుకోవడమే కాకుండా పాము తన వైపుకు వస్తుంటే నవ్వుతూ కూర్చుంది.

అద్దంపై పాకుతూ పక్కకు తిరిగిన పాము ఆ చిన్నారి కనపడగానే నుదుటిపై నోటితో తాకి ఆ తర్వాత ఒడిలో నుంచి ముందుకు వెళ్లింది. ఈ ఘటన జరుగుతున్నంతసేపు ఆ చిన్నారి కళ్లు ఆనందంతో మెరిసిపోతున్నాయి. ఇక ఈ వీడియోను పోస్టు చేస్తే దానిని 12 మిలియన్ మంది వీక్షించడంతో పాటు 29వేల లైకులు, 8వేల మంది రీట్వీట్‌లు చేసేశారు. ఇక వీడియోపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఇదే విధంగా జులై నెలలో ఓ మూడేళ్ల బాలిక కొండచిలువతో ఆడుతున్న వీడియో వైరల్ అయింది. గాయపడిన ఆ పామును చిన్నారి ప్రత్యేక పరికరంతో శుభ్రం చేస్తుంది. ఆ ఘటన జరుగుతున్నంతసేపు చిన్నారి తండ్రి పెంపుడు జంతువుపై తన కూతురు చూపిస్తున్న ప్రేమను చూసి మురిసిపోతూ ఉన్నాడు.