కత్తి కామన్ గురూ: గ‌న్‌తో బర్తడే కేక్ కటింగ్!

ఇంతకీ కేక్ ఎలా కట్ చేశారో తెలుసా? సాధారణంగా కత్తితో కదా కేక్ కట్ చేస్తారు. కానీ, ఈ కుర్రాడు కారులో నుంచి గన్ తీసి షూట్ చేసి కేక్ కట్ చేశారు.

  • Published By: sreehari ,Published On : January 15, 2019 / 06:26 AM IST
కత్తి కామన్ గురూ: గ‌న్‌తో బర్తడే కేక్ కటింగ్!

ఇంతకీ కేక్ ఎలా కట్ చేశారో తెలుసా? సాధారణంగా కత్తితో కదా కేక్ కట్ చేస్తారు. కానీ, ఈ కుర్రాడు కారులో నుంచి గన్ తీసి షూట్ చేసి కేక్ కట్ చేశారు.

పుట్టినరోజున కేక్.. కట్ చేయడం కామన్. అది అందరూ చేస్తారు. అందరిలా పుట్టినరోజు జరుపుకుంటే ఏం కిక్కు ఉంటుంది.. కాస్త డిఫరెంట్ గా జరుపుకోవాలనుకున్నాడోమో యూపీ కుర్రాడు. తన స్నేహితులతో కలిసి కారులో లాంగ్ ట్రిప్ కు వెళ్లాడు. రోడ్డు పక్కన కారు నిలిపాడు. అక్కడే బర్తడే వేడుకులు జరుపుకున్నాడు. బర్తడే కేక్ ను రోడ్డు పక్కన డివైడర్ పై పెట్టాడు. ఇంతకీ కేక్ ఎలా కట్ చేశారో తెలుసా? సాధారణంగా కత్తితో కదా కేక్ కట్ చేస్తారు. కానీ, ఈ కుర్రాడు కారులో నుంచి గన్ తీశాడు. కత్తికి బదులుగా గన్ తో షూట్ చేసి కేక్ కట్ చేశాడు. ముందు రెండుసార్లు గన్ గురి తప్పింది. మూడోసారి దగ్గరనుంచి కేక్ ను గురిపెట్టి కాల్చాడు.

అంతే.. హ్యాపీ బర్తడే అంటూ స్నేహితులతో కలిసి గట్టిగా కేకలు వేస్తూ సంబరాలు జరుపుకున్నాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా… మీరట్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను రికార్డు చేసిన యువకులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోలో కనిపించే లొకేషన్ మీరట్ కాదని, యువకులు ఎవరో ఇంకా గుర్తించలేదని యూపీ పోలీసులు తెలిపారు. సరదా కోసం తుపాకీతో ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రమాదకరమని, పొరపాటున మిస్ ఫైర్ అయితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని పోలీసులు యువకులను హెచ్చరిస్తున్నారు. వైరల్ వీడియో ఇదే..