కోవిడ్-19‌ ముప్పుపై చైనా కప్పిపుచ్చింది.. హాంగ్ కాంగ్ వైరాలజిస్ట్ ఆరోపణ!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి గురించి చైనాకు ముందే తెలిసి డ్రాగన్ కప్పిపుచ్చిందని ఆ దేశ వైరాలిజిస్ట్ ఆరోపిస్తోంది. హాంగ్ కాంగ్‌కు చెందిన వైరాజాలిస్ట్ అమెరికాకు పారిపోయింది. వైరస్ పుట్టుకపై చైనా కప్పిపుచ్చే ధోరణిపై ఆరోపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్ల మందికి కోవిడ్ -19 సోకిన సమయంలో.. హాంగ్ కాంగ్‌కు చెందిన ఈ వైరాలిజిస్ట్.. చైనాకు ప్రాణాంతక వైరస్ గురించి ముందే తెలిసిందని వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో నైపుణ్యం కలిగిన Li-Meng Yan.. ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి చైనాకు ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత ఉందని అన్నారు. 2020 ప్రారంభ రోజుల్లో వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఆర్గనైజేషన్ (WHO) రిఫరెన్స్ లాబొరేటరీ కూడా ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు మహమ్మారి ప్రత్యేకతగా పేర్కొంది.

కోవిడ్-19పై అధ్యయనం చేసిన సైంటిస్టులో యాన్ ఒకరు :
అగ్రశ్రేణి నిపుణులుగా పేరుపొందిన ఆమె పర్యవేక్షకులు, మహమ్మారి ప్రారంభంలో ఆమె చేస్తున్న పరిశోధనలను కూడా విస్మరించారని అన్నారు. లేదంటే ఎంతోమంది ప్రాణాలను వైరస్ బారినుంచి రక్షించి ఉండేవారమని తెలిపారు. COVID-19 ను అధ్యయనం చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి శాస్త్రవేత్తలలో యాన్ ఒకరు.
Virologist who fled to US from Hong Kong accuses China of coronavirus cover-up 2019 డిసెంబర్ చివరలో చైనా ప్రధాన భూభాగం నుంచి కరోనా కేసులు భారీగా వ్యాప్తిచెందాయి. హాంగ్ కాంగ్‌లోని వారితో సహా విదేశీ నిపుణులను చైనాలో పరిశోధన చేయడానికి ఆ దేశ ప్రభుత్వం నిరాకరించిందని ఆమె చెప్పారు. చైనాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ గురించి ముందుగానే యాన్ తన సహచరులతో కలిసి చర్చించారు. వైరస్ గురించి బహిరంగంగా చర్చిస్తున్న వైద్యులు పరిశోధకులు అకస్మాత్తుగా మౌనంగా ఉండిపోయారు. వుహాన్ నగరం నుండి వచ్చిన వారంతా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారారు. వారి వివరాలు అడగవద్దని చైనా హెచ్చరించింది.

హాంగ్ కాంగ్ నుంచి అమెరికా విమానం ఎక్కేసింది :
వైరస్ గురించి తాము మాట్లాడలేమని, కానీ, మాస్క్ ధరించాలని సూచించారు. అప్పటినుంచే ఒక మనిషి నుంచి మనిషికి కూడా ప్రసార కేసుల సంఖ్య భారీగా పెరగడం ప్రారంభమైంది. అప్పుడే యాన్ అమెరికాకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. క్యాంపస్‌లోని సెన్సార్‌లు, వీడియో కెమెరాలను దాటి ఏప్రిల్ 28న యునైటెడ్ స్టేట్స్ కాథే పసిఫిక్ విమానం ఎక్కింది. తాను అమెరికా రావడానికి కారణం కోవిడ్ వెనుక అసలు వాస్తవాన్ని బట్వాడా చేయడమేనని Fox Newsతో చెప్పారు.

చైనాకు పట్టుబడితే తనను జైలులో పెడతారని ఆమెకు తెలుసు. అందుకే అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు యాన్ అజ్ఞాతంలో ఉంది. తన దేశంలో ప్రభుత్వం తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. తన నోరు మూయించాలని ఉద్దేశంతో తనపై సైబర్ దాడికి స్కెచ్ వేశారని ఆరోపించారు. హాంకాంగ్ ప్రభుత్వం తన స్వస్థలమైన కింగ్డావోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. తన జీవితం ఇంకా ప్రమాదంలో ఉందని,  తాను ఇంటికి తిరిగి వెళ్లలేనని ఆమె ఆందోళన వ్యక్తంచేస్తోంది.

READ  హైదరాబాద్ లో తప్పిన టెన్షన్ : గాంధీలో కరోనా అనుమానితులకు నెగెటివ్ రిపోర్టు

Related Posts