లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

3నెలల క్రితమే పెళ్లైంది, భార్య గర్భవతి.. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో గౌరీశంకర్ మృతి

Published

on

visakha gas leak accident, gowri shankar dies

విశాఖలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతి చెందిన కెమిస్ట్ గౌరీశంకర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గౌరీశంకర్ కు మూడు నెలల క్రితమే వివాహమైంది. 2020 ఏప్రిల్ 8న విజయనగరం జిల్లాకి చెందిన వెంకటలక్ష్మితో పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఇవాళ (జూన్ 30,2020) సెలవు పెట్టి భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పిన గౌరీశంకర్ గ్యాస్ లీక్ ఘటనలో మరణించడంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గౌరీశంకర్ భార్య గుండె పగిలేలా రోదించింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం:
సోమవారం(జూన్ 29,2020) రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. నలుగురు అస్వస్థతకు గురయ్యారు. బెంజిమిడజోల్(Benzimidazole gas) వ్యాపర్స్ ఎక్కువ మోతాదులో లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. గత ఐదేళ్లలో ఈ పరిశ్రమలో గ్యాస్ లీకేజీతో ప్రమాదం జరగడం ఇది రెండోసారి. అప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే మరోసారి ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేయించారు అధికారులు. ఓ రియాక్టర్ ఉన్న విభాగంలో మాత్రమే గ్యాస్ లీక్ అయ్యిందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సీఎం జగన్ కు అధికారులు నివేదించారు. గ్యాస్ లీకేజీ ఘటనపై కలెక్టర్ వినయ్ చంద్ సీరియస్ అయ్యారు. నలుగురు ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేశారు. ప్రమాదంపై పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. కాగా, విచారణ పూర్తయ్యే వరకు పరిశ్రమను తెరవొద్దని సీఎం జగన్ ఆదేశించారు.

* విశాఖ పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీక్
* సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి
* నలుగురికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
* మృతుల్లో షిఫ్ట్ ఇంచార్జ్ నాగేంద్ర, గౌరీ శంకర్
* అస్వస్థతకు గురైన చంద్రశేఖర్, ఆనంద్ బాబు, జానకిరామ్, సూర్యనారాయణ
* హెల్పర్ చంద్రశేఖర్ పరిస్థితి విషమం, కేర్ ఆసుపత్రికి తరలింపు
* లీక్ అయిన గ్యాస్ బెంజిమిడజోల్ వేపర్ గా గుర్తింపు
* గ్యాస్ లీక్ ఘటనతో మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ నగరం
* స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే మరో విషాదం
* వరుస ఘటనలతో భయాందోళనలో విశాఖ వాసులు
* గ్యాస్ లీక్ ను అదుపు చేసిన సిబ్బంది
* గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం, నలుగురు అధికారులతో కమిటీ

Read:విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ సీరియస్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *