నగ్న దొంగ దొరికాడు, విశాఖలో ఒంటిపై నూలు పోగు లేకుండా చోరీలు చేస్తున్న దొంగను పట్టుకున్న పోలీసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖపట్నంలో కలకలం రేపిన విచిత్ర దొంగ దొరికాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. శనివారం(సెప్టెంబర్ 12,2020) పోలీసులు మీడియాతో మాట్లాడారు. చోరీ కేసుని చేధించామని, దిగంబర దొంగను పట్టుకున్నామని తెలిపారు. నగ్న దొంగ దొరకడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు.

ఇటీవల విశాఖ నగరంలో కొత్త తరహా దొంగతనాలు జరిగాయి. ఓ దొంగ భిన్నంగా వ్యవహరించాడు. ఒంటి మీద దుస్తులు తీసేసి నగ్నంగా ఇళ్లలోకి దూరి చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అటు స్థానికులు, ఇటు పోలీసులు షాక్ కి గురయ్యారు.

గుడిలో ముగ్గురు పూజారులు దారుణ హత్య..!!


మర్రిపాలెం వుడా లేఅవుట్ లో వడ్డాది త్రినాథరావు అనే వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగ ఆదివారం(సెప్టెంబర్ 6,2020) తెల్లవారు జామున కిటికీల ద్వారా లోపలికి చొరబడ్డాడు. తనను ఎవరూ పట్టుకోకుండా ఉండేందుకు అతడు ఒంటిపై దుస్తులు లేకుండానే వచ్చాడు. ఇళ్లంతా గాలించాడు. బంగారు, వెండి సామగ్రి లేకపోవడంతో రూ.20 వేలు తీసుకొని వెళ్లిపోయాడు. ఇదే సమయంలో మరో రెండు ఇళ్లలోనూ చోరీకి పాల్పడ్డాడు. దొంగ ఆనవాళ్లు తెలుసుకునేందుకు పోలీసులు ఓ ఇంట్లోని సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా షాక్ తిన్నారు. దొంగ నగ్నంగా కనిపించాడు. ఈ విషయం తెలిసి స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాఫ్తు చేపనట్టిన పోలీసులు చివరికి దొంగను పట్టుకున్నారు.

Related Posts