Home » విశాల్, ఆర్య ‘ఎనిమి’ – ఆస్కార్ బరిలో ‘జల్లికట్టు’
Published
2 months agoon
ENEMY – Jallikattu: విశాల్, ఆర్య కలయికలో ‘నోటా’ ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు.
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫిల్మ్‌కి ‘ఎనిమి’ అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ మూవీలో విశాల్ హీరోగా, ఆర్య విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. మృణాళిని రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.
ఆస్కార్ బరిలో ‘జల్లికట్టు’
మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఇండియా తరపున ఆస్కార్ 2021 బరిలో నిలిచింది. మన దేశం తరపున హిందీ, మలయాళం సహా పలు భాషల్లో 27 చిత్రాలు ఆస్కార్ నామినేషన్స్‌కు పోటీ పడగా ‘జల్లికట్టు’ను జ్యూరీ ఎంపిక చేసింది.
జంతువులు, మనుషుల మధ్య ఉన్న ఎమోషన్స్‌ను చక్కగా తెరకెక్కించగా మంచి ఆదరణ లభించింది. 93వ ఆకాడమీ అవార్డ్స్ రేసులో నిలిచిన ఈ చిత్రానికి హరీస్ కథనందించగా, లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించారు. ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్, వినోద్ జోస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.