లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

విష్ణుప్రియ ‘చెక్ మేట్’ రిలీజ్ ఎప్పుడంటే..

Published

on

Vishnupriya’s Check Mate Movie:  చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘చెక్ మేట్’. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, విష్ణుప్రియ, సందీప్, దీక్షా పంత్, బ్రహ్మనందం, రఘుబాబు, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు.


ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో విష్ణుప్రియ, చిత్ర దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి, నటుడు ఆర్కే తదితరులు పాల్గొన్నారు.Vishnupriyaఈ సందర్భంగా దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి
మాట్లాడుతూ: ‘‘చెక్ మేట్’ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. థియేటర్స్ డిసెంబర్ 4నుంచి ఓపెన్ అవుతాయి అని తెలుస్తుంది. ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తాము.


ఇటీవల ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా ప్రస్తుత ట్రెండ్‌కు తగిన విధంగా అన్ని హంగులతో ప్రేక్షకులను మెప్పించే విధంగా వుంటుంది.
నలుగురు వ్యక్తులు వాళ్లకు వచ్చిన సమస్యలను ఎలా దైర్యంగా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాం.

రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు గార్లతో పాటు మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. భారీ స్టార్ కాస్ట్‌తో, మలేషియా, సింగపూర్‌లోని బ్యూటిఫుల్ లోకేషన్స్‌లో తెరకెక్కించాం’’ అన్నారు. విష్ణు ప్రియ మాట్లాడుతూ: ‘‘చెక్ మేట్’ అంటే ఇద్దరు యంగ్ స్టర్స్ మధ్య ఉన్న సమస్య కారణంగా ఒకరి వలన ఒకరు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ సమస్య నుంచి బయట పడడానికి అవతల వాళ్ళు తీసుకున్న యాక్షన్ ‘చెక్ మేట్’. ఈ అవకాశం నాకు శివరాత్రి వచ్చింది. ఆ శివుడే నాకు ఈ అవకాశం ఇచ్చాడని అనుకుంటాను.


గాడ్సే ‘మరణ వాంగ్మూలం’!


స్టోరీ ఏంటి, హీరో ఎవరు అని అడగలేదు. మా మమ్మీ వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్ ప్రసాద్ గారు. మా ఇంటికి వచ్చి నన్ను చూసిన తరువాత నువ్వే హీరోయిన్ అంటే నేను నమ్మలేదు. అయితే ఒక వారం రోజులకే ఆర్‌ఎఫ్‌సికి పిలిచి షూట్ మొదలు పెట్టినప్పుడు అక్కడున్న కెమెరాలు, జిమ్మీలు ఆ వాతావరణం చూసి బ్లాంక్ అయ్యాను.

నాకు అసలు యాక్టింగ్ ఏమీ తెలీదు. కానీ ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఈ ‘చెక్ మేట్’ సినిమా నాకు వెరీ స్పెషల్. నాకు ఎంతో నేర్పించింది. నాకు మంచి వ్యక్తులను పరిచయం చేసింది. నాకు ఎన్నో మెమరీస్ ఇచ్చింది. అమ్మ రాజశేఖర్ కొరియోగ్రఫీ చేసిన రెండు సాంగ్స్ మీరందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.


డా.రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షా పంత్, బ్రహ్మానందం, రఘుబాబు, సంపూర్ణేష్ బాబు, షకలక శంకర్, పూర్ణిమ, కృష్ణ భగవాన్, ఆర్కే మల్లిడి, సుడిగాలి సుధీర్, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ‘గరుడ వేగ’ అంజి, మ్యూజిక్: మహతి, ఎడిటర్: క్రాంతి, లిరిసిస్ట్: రెహమాన్, కో ప్రొడ్యూసర్: కే.కామేశ్వర్, నిర్మాత, దర్శకత్వం: ప్రసాద్ వెలంపల్లి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *