ఇండియాలో ఇదే ఫస్ట్ : Vistara విమానాల్లో Wi-Fi ఇంటర్నెట్ సేవలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారతీయ వైమానిక సంస్థ విస్తారా తమ ఎయిర్ లైన్ సర్వీసులో ఇంటర్నెట్ సేవలు ఆఫర్ చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం విస్తారా తమ ఎయిర్ లైన్‌లో Wi-Fi ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీంతో విస్తారా విమానంలో ఇంటర్నెట్ సేవలను అందించే మొట్టమొదటి భారతీయ ఎయిర్ లైన్ కంపెనీగా అవతరించింది.బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్స్ విమానం సర్వీసుతో ఈ ఇంటర్నెట్ సేవలను విస్తారా ప్రారంభించింది. సెప్టెంబర్ 18 నుంచి విస్తారా ఆఫర్ అందుబాటులోకి వచ్చేసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో నుంచి ఢిల్లీ-లండన్ హెత్రో (LHR) మధ్య నడిచే విమాన సర్వీసుల్లో ఈ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి.విస్తారా విమాన ప్రయాణికులకు ఈ ఆఫర్ ఉచితంగా అందిస్తోంది. కాకపోతే పరిమిత సమయం మాత్రమే.. ఎయిర్ బస్ A321నియో ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసుల్లో కూడా విస్తారా వై-ఫై ఇంటర్నెట్ సేవల కోసం ప్లాన్ చేస్తోంది.విస్తారా విమానాల్లో ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్స్ వైఫై సేవలను వినియోగించుకోవచ్చు. భూమి నుంచి 35,000 అడుగుల ఎత్తులో విస్తారా కస్టమర్లు ఈ ఇంటర్నెట్ సేవలను వినియోగించు కోవచ్చు.Vistara Airline అందించే సర్వీసుల్లో ఎంటర్ టైన్మెంట్ కోసం In-Flight Entertainment (IFE) system కూడా అందుబాటులో ఉంది. విస్తారా వినియోగదారులు 700 గంటల పాటు అందించే ప్రత్యేకమైన ప్యాకేజీలో మూవీలు, టీవీ షోలు, ఆడియో, వీడియోలతో పాటు గేమ్స్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

Related Posts