Vitamin D ఉంటే కరోనాతో చనిపోయేది 50 శాతమే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రోజూ Vitamin D డోస్ తీసుకునే వాళ్లలో కరోనావైరస్ తో చనిపోయే వాళ్ల సంఖ్య సగమే ఉంటుందని ఓ స్టడీలో తేలింది. రక్తంలో ఉండే ఇమ్యూన్ సెల్స్‌తో విటమిన్ కు లింక్ ఉంటుందని.. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు చెప్పారు. శరీరంలో ఉండే సైటోకిన్ తగ్గడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ పై ప్రభావం చూపిస్తుంది. అదే రక్తంలో ఉండే ప్రొటీన్లు ఉండే లెవల్స్ ను తారుమారు చేస్తుంది.

ఈ స్టడీలో భాగంగా 235 మంది పేషెంట్లు బ్లడ్ శాంపుల్స్ పరిశీలించి Vitamin Dను కాలిక్యులేట్ చేశారు. క్లినికల్ రిజల్ట్స్‌లో శ్వాస సంబంధిత సమస్యలు, స్పృహ కోల్పోవడం, చనిపోవడం వంటివన్నీ బయటపడ్డాయి. 40ఏళ్లకు పైగా వయస్సున్న వారిలో విటమిన్ డీ లెవల్స్ కనీసం 30నానోగ్రామ్స్/మిల్లీలీటర్ ఉండాలి. అంటే 51శాతం కంటే ఎక్కువగా లేకపోతే విటమిన్ లోపంతో చనిపోతున్నారు.

PLOS ONE జర్నల్ కథనంలో ప్రచురించిన వివరాల ప్రకారం.. విటమిన్ డీ, కరోనావైరస్ ల మధ్య లింక్ గురించి.. డా.మైకెల్ హాలిక్ వివరణ ఇచ్చారు. ‘ఇన్‌ఫ్లూయెంజా ఇన్ఫెక్షన్, కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ లు కలిసి వచ్చిన వారికి హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా కాంప్లికేషన్స్ పెరిగి చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

అమెరికా వ్యాప్తంగా విటమిన్ డీ కొరత పిల్లలతో పాటు పెద్ద వాళ్లలోనూ ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకించి శీతాకాలం ఇది ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. అందుకే విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకుని బయటపడొచ్చని చెప్తున్నారు.

నిజానికి విటమిన్ డీ అనేది చాలా ఆరోగ్యకరమైన న్యూట్రియెంట్.. అది ఎముకలు, కండరాలు, పళ్లు గట్టిగా ఉండేందుకు సూర్యకాంతి ద్వారా విటమిన్ డి శరీరానికి దక్కించుకోవడం చాలా అవసరం. నిజానికి ప్రతిఒక్కరూ రోజూ 10మైక్రోగ్రాముల విటమిన్ డీ తీసుకోవాలని NHS సూచిస్తుంది. ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని అందరూ ఇండోర్స్ లోనే ఫిక్స్ అయిపోవడంతో విటమిన్ డీ అనేది చాలా తక్కువ పొందినట్లు వెల్లడైంది.

Related Posts