లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

వితంతువులు, ఒంటరి మహిళలే టార్గెట్.. 30 పెళ్లిళ్లు చేసుకున్న బాలక్రిష్ణన్ అరెస్ట్

విశాఖలో అంతర్రాష్ట్ర నేరగాడు జవహర్ బాలక్రిష్ణన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీషీటర్ చిట్టిమాము బర్త్ డే వేడుకల్లో చిక్కాడు

Published

on

vizag police arrest cheater trapping woman

విశాఖలో అంతర్రాష్ట్ర నేరగాడు జవహర్ బాలక్రిష్ణన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీషీటర్ చిట్టిమాము బర్త్ డే వేడుకల్లో చిక్కాడు

విశాఖలో అంతర్రాష్ట్ర నేరగాడు జవహర్ బాలక్రిష్ణన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీషీటర్ చిట్టిమాము బర్త్ డే వేడుకల్లో చిక్కాడు జవహర్. డబ్బున్న ఒంటరి మహిళలు, వితంతవులే వాడి టార్గెట్. 30 పెళ్లిళ్లు చేసుకున్నాడు ఈ కేటుగాడు. పెళ్లి జరిగిన వెంటనే డబ్బు, బంగారంతో పారిపోతాడు. సోషల్ మీడియా వేదికగా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. జవహర్ పై ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో 25కేసులు ఉన్నట్టు గుర్తించారు. జవహర్ రౌడీషీటర్ చిట్టిమాముతో కలిసి విశాఖలో సెటిల్ మెంట్లు కూడా చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. జవహర్ పై మరిన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

ఈజీ మనీ కోసం ఒంటరి మహిళలను టార్గెట్ చేశాడు:
చిట్టిమాము గ్యాంగ్‌తో కలిసి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాడు జవహర్.  జవహర్‌ బాలకృష్ణన్‌ అలియాస్‌ బాలాకుమార్‌ మోసాల గురించి తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. విచారణలో అతడు సుమారు 30 మంది మహిళలను మోసగించినట్లు వెల్లడైంది. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన చిలకూరి జవహర్‌ బాలకృష్ణన్‌ సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. విడాకులు తీసుకుని, బాగా డబ్బులు ఉండి రెండో పెళ్లి కోసం ఎదురుచూసే మహిళలు, భర్త చనిపోయి మరో పెళ్లి కోసం ఎదురు చూసే డబ్బున్న మహిళలనే టార్గెట్‌ చేసేవాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల సాయంతో పరిచయం పెంచుకుని తన ఫొటోలు, ఇతర వివరాలు పంపించి నమ్మకం పెంచుకునేవాడు. అనంతరం వారిని పెళ్లి చేసుకుని కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉంటూ తర్వాత డబ్బు, నగలతో పరారయ్యేవాడు.

పెళ్లి పేరుతో సహజీవనం, నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్:
మరికొందరిని పెళ్లి చేసుకోకుండానే సహజీవనం పేరుతో శారీరకంగా వాడుకుని సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీసేశాడు. వాటితో మహిళలను బెదిరించి డబ్బులు గుంజేవాడు. ఈ విధంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 30 మంది మహిళలను మోసం చేశాడు. వీరిలో 17 మంది పోలీసులను ఆశ్రయించడంతో కేసులు నమోదు చేశారు. మరోవైపు పలువురు వ్యాపారవేత్తలకు ప్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో అనేక రాష్ట్రాల్లో 25 వరకు కేసులు నమోదయ్యాయి. 

జైల్లో స్నేహంగా మారిన పరిచయం:
ఛీటింగ్ కేసులో జవహర్‌ బాలకృష్ణన్‌ను కొద్ది నెలల క్రితం వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరిలోవలోని సెంట్రల్ జైలుకు తరలించిన సమయంలో అక్కడే రౌడీషీటర్‌ చిట్టిమాముతో బాలకృష్ణన్‌కు పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా అధికారులు ఖైదీలను జైలు నుంచి విడుదల చేశారు. అప్పుడే బయటకు వచ్చిన అతడు చిట్టిమాము గ్యాంగ్‌లో చేరి నగరంలో అనేక సెటిల్‌ మెంట్లు చేశాడు. చిట్టిమాము తన పుట్టిన రోజు వేడుకను జూన్ 5న కూర్మనపాలెం ప్రాంతంలోని అక్షిత గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించాడు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడ దాడి చేయగా 30 మంది చిక్కారు. వారందరిపైనా లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. చిట్టిమాముతో పాటు మరో ఐదుగురు తప్పించుకున్నారు. వారి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టి ఆరో తేదీ తెల్లవారుజామున కారులో వెళ్తున్న చిట్టిమాము, జవహర్ బాలకృష్ణన్‌ , ఆనంద్, మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వీరిని స్టేషన్ లో ప్రశ్నిస్తుండగా జవహర్‌ బాలకృష్ణన్‌ అంతర్రాష్ట్ర నేరగాడని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అతడి నేరాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాఫ్తులో జవహర్ క్రైమ్ హిస్టరీ తెలిసి పోలీసులు షాక్ తిన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *